వైసీపీ గుర్తింపు రద్దు పిటీషన్ పై తీర్పు రిజర్వ్ .. ఢిల్లీ హైకోర్టులో హోరాహోరీ వాదనలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని దాఖలైన పిటీషన్ పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం జగన్ నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ పేరును వాడకుండా చూడాలని అన్న వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా దాఖలుచేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
ఇక ఈ కేసులో వైసీపీ ని రద్దు చేసి వైయస్సార్ కాంగ్రెస్ పేరు ఇతరులు వాడకుండా చూడాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు . లెటర్ హెడ్ పోస్టర్లు బ్యానర్లు లో ఉపయోగించే పేరు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా ఎన్నికల సంఘం వైయస్సార్ అనే పేరును తమకు కేటాయించిందని , దానిని ఇతరులు వినియోగించడానికి వీల్లేదని వారు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వైఎస్సార్ పేరును వినియోగించుకునేందుకు తమకు హక్కు ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు.

తమకు కేటాయించిన పేరును వైసీపీ వాడుకోవటం వల్ల తమ పార్టీకి నష్టం వాటిల్లుతుంది అంటూ వారు కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు . ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వైఎస్సార్ పేరును వాడుకుంటున్నారని అన్నారు . ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ తీర్పును ఈ నెల 17వ తేదీన వెల్లడిస్తామని పేర్కొంది. ఇక కోర్టులో తీర్పు రిజర్వ్ అయిన నేపధ్యంలో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications