మాచర్ల దాడులపై పిన్నెల్లి సోదరులకు జూలకంటి సవాల్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ రోజున, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఇంకా ఏపీ రగులుతూనే ఉంది. ముఖ్యంగా పల్నాడులో ఇంకా ఉద్రిక్తతలు చల్లారలేదు.. ఇటీవల ఈ దాడులపైన సిట్ దర్యాప్తు జరిపి ప్రాథమిక నివేదికను డిజిపికి అందజేశారు.
పిన్నెల్లి సోదరులకు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి సవాల్
సిట్ బృందం రెండు రోజులు పర్యటించి అక్కడ హింసకు గల కారణాలపై, బాధ్యులపై డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇచ్చింది. తాజాగా మాచర్ల ప్రాంతంలో జరిగిన ఘటనలు, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని పిన్నెల్లి సోదరులు సిద్ధమేనా అంటూ మాచర్ల నియోజకవర్గ టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి సవాల్ విసిరారు.

పిన్నెల్లి సోదరులపై సంచలన ఆరోపణలు
మాచర్లలో జరిగిన విధ్వంసం వైసిపి వల్లనేనని ఆయన పేర్కొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరుండి మరీ ఈవీఎంలను ధ్వంసం చేయించారని, వైసిపి మూకలు తాలిబన్ ముఠాలుగా, మొహాలకు ముసుగులు ధరించి విధ్వంసం చేశారని జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆరోపించారు. కారంపూడి, రెంటాల ప్రాంతాలలో పిన్నెల్లి వెంకటరామిరెడ్డి వాహనాల్లో తిరుగుతూ సినీ ఫక్కిలో కర్రలు, రాళ్లతో దాడులు చేయించారని విమర్శలు గుప్పించారు.
మాచర్ల నీ తాత జాగీర్ కాదు
నువ్వు భయపడితే భయపడే వాళ్ళు ఎవరూ లేరని పేర్కొన్నజూలకంటి బ్రహ్మానందరెడ్డి పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ అర్ధరాత్రి పరారీ అయ్యారని ఎద్దేవా చేశారు. పిన్నెల్లి సోదరులకు చట్టాన్ని గౌరవించడం చేతకాదని, వారిద్దరికీ ప్రజాస్వామ్య విలువలు తెలియవని జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. మాచర్ల నీ తాత జాగీర్ కాదు అంటూ మండిపడిన జూలకంటి పోలీస్ అధికారులు చూస్తుండగానే నాపై కారం చల్లారని ఆరోపించారు.
సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయిస్తాం
మాచర్లలో తాలిబన్ పాలన సాగుతుందన్న అనుమానంలో ప్రజలు ఉన్నారని ఎక్కడైనా పరామర్శకు వెళ్లే వాళ్ళు ఆయుధాలు తీసుకుపోతారా.. చెప్పాలని ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు పారిపోయాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల మానప్రాణాలతో ఆడుకున్నావని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే మాచర్లలో జరిగిన అరాచకాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని జూలకంటి బ్రహ్మానందరెడ్డి తేల్చి చెప్పారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications