Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహానాడుకు జూ ఎన్టీఆర్ దూరం వెనుక - అదే బాటలో ఆ ఇద్దరు ఎంపీలు..!!

తెలుగు దేశం మహానాడు రెండు రోజులు అట్టహాసంగా జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు గతం కంటే భిన్నంగా వ్యవహరించారు. పార్టీ తొలి విడత మేనిఫెస్టోను ప్రకటించారు. వైసీపీకి ధీటుగా సంక్షేమం అందిస్తామని ప్రకటించారు. ఎన్నికలకు సిద్దం కావాలంటూ సమరశంఖం పూరించారు. ఈ మహానాడులోనే పొత్తులపైన స్పష్టత ఇస్తారని భావించినా ఆ అంశం టచ్ చేయలేదు. మరోసారి మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. తారక్ కేంద్రంగా రాజకీయ చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఇద్దరు ఎంపీలు హాజరు కాలేదు.

మహానాడులో కీలకంగా:ఎన్నికల వేళ టీడీపీ మహానాడును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. చంద్రబాబు పూర్తిగా ఎన్నికలే లక్ష్యంగా మార్గనిర్దేశనం చేసారు. ఈ సారి ఎన్నికల్లో అందరినీ కలుపుకువెళ్లాలనేది చంద్రబాబు వ్యూహం. ఇందు లో భాగంగా జనసేన, బీజేపీతోనూ పొత్తు దిశగా కసరత్తు జరుగుతోంది. మహానాడులోనే ఈ పొత్తులపైన సంకేతాలు ఇస్తారని భావించినా..ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన..బీజేపీ వైఖరిపైన సందేహాలతో ఆ అంశం ప్రస్తావన చేయలేదు. జనసేనతో పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ప్రధానంగా సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్న సమయంలో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మహిళలు..యువత..రైతులు..బీసీ వర్గాలే లక్ష్యంగా ఫస్ట్ ఫేజ్ మేనిఫెస్టో విడుదల చేసారు.

Junior NTR and two TDP mps away from Mahanadu,was there no invitation - check here

దూరంగా జూ ఎన్టీఆర్:ఈ మహానాడుకు మరోసారి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఈ నెల 20న హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి సభకు తారక్ ను ఆహ్వానించారు. కానీ, జూనియర్ హాజరు కాలేదు. ఎన్టీఆర్ జయంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ లో తారక్ నివాళి అర్పించారు. అటు జనసేన..ఇటు నందమూరి కుటుంబం మద్దతుతో ఈ సారి ఎన్నికల్లో ఎటువంటి వివాదాస్పద చర్చలకు అవకాశం ఇవ్వకూడదనేది చంద్రబాబు వ్యూహం. తారక్ పార్టీలో యాక్టివ్ రోల్ పైన లోకేష్ పాజిటివ్ గా స్పందించారు. కానీ, తారక్ మాత్రం గత అనుభవాల కారణంగా నే పార్టీ వ్యవహారాలకు..పార్టీకి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. సినిమాలపైనే తన ఫోకస్ అనే సంకేతాలు ఇస్తున్నారు. కానీ, జూ ఎన్టీఆర్ కేంద్రంగా చర్చ మాత్రం కొనసాగుతోంది. దర్శకుడు ఆర్జీవీ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయాలను ప్రశంసించారు. నందమూరి కుటుంబంలో ఒకే ఒక్క మగాడు అంటూ వ్యాఖ్యానించారు.

Junior NTR and two TDP mps away from Mahanadu,was there no invitation - check here

ఆ ఇద్దరు ఎంపీలు ఏమయ్యారు:ఇదే సమయంలో టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు మహానాడులో కనిపించ లేదు. రామ్మోహన్ నాయుడు క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీకి..నియోజకవర్గానికి కొంత కాలంగా దూరంగా ఉంటున్న గల్లా జయదేవ్ మహానాడు వేదిక పైన కనిపించలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఎంపీ కేశినేని నాని మహానాడుకు హాజరు కాలేదు. పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. కొంత కాలంగా కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో వివాదాస్పదంగా మారాయి. సొంత పార్టీ నేతలే సోషల్ మీడియా వేదికగా నానిని లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్నికల వేళ ప్రతిష్ఠాత్మకం గా భావించిన మహానాడులో సొంత పార్టీ ఎంపీలే హాజరు కాకపోవటం..అటు పవన్ కు దగ్గరవుతూ..ఇటు జూనియర్ ను ప్రాధాన్యత ఇవ్వకపోవటం పైన భిన్న వాదనలు మొదలయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+