RRR: జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్: అంతకుముందు- వారిద్దరికీ!
హైదరాబాద్: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. దీనితో ఎన్టీఆర్, ఆయన కుటుంబ సభ్యులందరూ ఐసొలేషన్‌లో ఉంటున్నారు. తనకు కరోనా వైరస్ సోకిన విషయాన్ని జూ.ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన రౌద్రం, రణం, రుధిరం (RRR) సినిమా షూటింగ్‌లో ఉంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌లో వైరస్ లక్షణాలేవీ కనిపించట్లేదని తెలుస్తోంది. ఆయనను అసింప్టోమేటిక్‌గా భావిస్తున్నారు. ఆదివారం ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఐసొలేషన్‌లోకి వెళ్లారు. కరోనా ప్రొటోకాల్స్‌ను తాము పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నామని చెప్పారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని, కోవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటించాలని కోరారు. ఇదివరకు ఇదే సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన రామ్‌చరణ్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన కోలుకున్నారు. సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ హీరోయిన్ ఆలియా భట్ సైతం ఈ మహమ్మారి బారిన పడ్డారు. కోలుకున్న తరువాత ఆమె కొద్దిరోజుల పాటు మాల్దీవుల్లో విశ్రాంతి తీసుకున్నారు.
I’ve tested positive for Covid19. Plz don’t worry,I’m doing absolutely fine. My family & I have isolated ourselves & we’re following all protocols under the supervision of doctors. I request those who’ve come into contact with me over the last few days to pl get tested. Stay safe
— Jr NTR (@tarak9999) May 10, 2021
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications