బాబు ఆలోచించారు నాదే తప్పు, ముందే తెలుసుకున్నా: జగన్‌పై జూపూడి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాను ఎక్కువ కాలం కొనసాగలేనని అందరి కంటే ముందు తానే పసిగట్టానని టిడిపి నేత జూపూడి ప్రభాకర రావు ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

చిరంజీవితో విజయసాయి చర్చలు?: జగన్-చంద్రబాబులకు షాకిస్తారా?

యనమల రమ్మంటే ఆలోచించా

యనమల రమ్మంటే ఆలోచించా

టిడిపిలో చేరాలంటూ తనకు యనమల రామకృష్ణుడు నుంచి ఎప్పుడో పిలుపు వచ్చిందని, కానీ సిద్ధాంతాలపరంగా వైరుధ్యం ఉండటంతో తాను వెంటనే టిడిపిలోకి వెళ్లలేకపోయానని చెప్పారు. ఒకసారి వచ్చి ముఖ్యమంత్రిని కలువమంటూ యనమల పిలిచినా.. సీఎంను కలవడానికి మూడు నెలల సమయం తీసుకున్నానని జూపూడి చెప్పారు.

జగన్ వద్ద నచ్చకే టిడిపిలో చేరా

జగన్ వద్ద నచ్చకే టిడిపిలో చేరా

వైసిపిలో తనకు చాలా అన్యాయం జరిగిందని, అక్కడ నచ్చకే బయటకు వచ్చానని జూపూడి చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత ఆరు నెలలకు టిడిపిలో చేరానన్నారు. నాడు చంద్రబాబును కలిశానని, లోకేష్ కూడా మాట్లాడారని, తదనంతరం టిడిపిలో చేరానని చెప్పారు.

ఎక్కడికైనా తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి అన్నారు

ఎక్కడికైనా తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి అన్నారు

ఎన్నికలకు ముందు తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి ఓసారి తనతో మాట్లాడారని జూపూడి చెప్పారు. అన్నా మీలాంటి దళిత నేత టిడిపిలో ఉంటే ఎక్కడి వరకైనా తీసుకెళతామని చెప్పారని, అప్పుడు, ఎక్కడి వరకు తీసుకెళతారంటూ తాను సరదాగా అడిగానని, కేవలం ప్యాంటు, చొక్కా వేసుకొస్తే చాలని, బాపట్లలో ఎంపీగా గెలిపించుకుని, పార్లమెంటు వరకు తీసుకెళతామని చెప్పారని జూపూడి అన్నారు.

చంద్రబాబు నా గురించి ఆలోచించారు, కానీ తప్పు నాదే

చంద్రబాబు నా గురించి ఆలోచించారు, కానీ తప్పు నాదే

సీఎం చంద్రబాబు తనకు సరైన అవకాశాన్ని ఇవ్వాలని అనుకున్నప్పటికీ, తన ఓటు హక్కు హైదరాబాదులో ఉండటంతో ఎమ్మెల్సీ అయ్యే అవకాశాన్ని కోల్పోయానని జూపూడి అన్నారు. అంతకు ముందు ఇదే ఓటుతో కొండెపిలో పోటీ చేశానని, రాష్ట్రం విడిపోవడంతో సమస్య వచ్చిందన్నారు. తన ఓటును సొంతూరుకి మార్చుకోవాలనే ఆలోచన కూడా రాలేదన్నారు.

చంద్రబాబు చెప్పింది చేశారు కానీ

చంద్రబాబు చెప్పింది చేశారు కానీ

టిడిపిలో తాను చేరినప్పుడు పార్టీ నేతలందరి సమక్షంలో జూపూడిని ఉన్నతస్థాయికి తీసుకు వెళ్తానని చంద్రబాబు చెప్పారని, చెప్పినట్టుగానే తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని, కానీ, పొరపాటు తనదేనని చెప్పారు. అయినప్పటికీ తనకు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చారన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader Jupudi Prabhakar Rao interesting comments on joining in Telugu Desam party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి