వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీకి షాక్: పార్టీ గుడ్ బై చెప్పిన జ్యోతుల.. కారణమదేనా?

తూర్పు గోదావరిలో అధికార పార్టీ లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. వైసీపీ నుంచి వచ్చిన జ్యోతుల నెహ్రూతో పొసగలేక నేతలు జారుకుంటున్నారు.

|
Google Oneindia TeluguNews

జగ్గంపేట: తూర్పు గోదావరిలో అధికార పార్టీ లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. వైసీపీ నుంచి వచ్చిన జ్యోతుల నెహ్రూతో పొసగలేక నేతలు జారుకుంటున్నారు. తాజాగా ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ జ్యోతుల చంటిబాబు టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

టీడీపీలో పాము-ముంగీసల కొట్లాట?: చిత్తు చేసే ఎత్తుగడలు.. ఇదీ మర్మం!టీడీపీలో పాము-ముంగీసల కొట్లాట?: చిత్తు చేసే ఎత్తుగడలు.. ఇదీ మర్మం!

వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జ్యోతుల నెహ్రూ తమపై పెత్తనం చలాయించాలని చూడటం జిల్లా టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదని తెలుస్తోంది. ఇదే జిల్లాకు చెందిన మంత్రి యనమలతోను జ్యోతులకు తొలి నుంచి వైరం కొనసాగుతోంది. జిల్లా జడ్పీ చైర్మన్ పదవి విషయంలో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి.

jyotula chantibababu quits telugu desam in east godavari

జడ్పీ చైర్మన్ పదవి జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ కు దక్కాక.. జిల్లా నేతల్లో అసంతృప్తులు మరింత తీవ్రమైనట్లు చెబుతున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు తమపై ఆధిపత్యం చలాయించాలని చూడటం చాలామంది టీడీపీ నేతలకు మింగుడపడటం లేదని అంటున్నారు. ఈ కారణంతోనే తాజాగా జ్యోతుల చంటిబాబు పార్టీని వీడారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, పురుషోత్తంపట్నం ప్రాజెక్టు పనులను ప్రారంభించిన సమయంలోను తనకు ఆహ్వానం దక్కకపోవడంపై జ్యోతుల నవీన్ అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తున్న ఆయన.. ఇక టీడీపీలో కొనసాగడం ఇష్టం లేకనే బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలకు ముందు చంటిబాబు పార్టీని వీడటం టీడీపీని కలవరపెడుతోంది.

English summary
TDP Leadr Jyotula Chantibabu said good bye to Telugu Desam party in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X