కేసీఆర్ ముక్కు పిండేస్తాడట.. కేసీఆర్ పారిపోతాడట... కే ఏ పాల్ కామెడీ

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడేకొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకర్ని మించి ఒకరు విమర్శలతో రాజకీయాన్ని రసకందాయంలో పడేస్తున్నారు. పార్టీ అధినేతలు ఒకరిపై మాటల తూటలు పేల్చుతున్నారు. ఇక వీరంతా ఒక ఎట్టు అయితే ఏపీలో అందరి కంటే సంచలనం మాత్రం ప్రజా శాంతి అధినేత కేఏ పాల్ .

తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేఏ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తే ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్‌కు ఓటు వేసినట్టేనని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రచారం చేస్తున్నారు . ఇక కేసీఆర్ గురించి పాల్ చెప్పిన మాటలు వింటే విచిత్రంగానూ, ఆశ్చర్యంగానూ అనిపించక మానవు.

K.A Paul ocmedy on KCR .. He is only the capable person to control KCR

అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను చూస్తే కేసీఆర్ పారిపోతాడని చెప్పారు కేఏ పాల్ . అంతేనా కేసీఆర్ ముక్కు పిండేస్తానని, కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా కేవలం తనకు మాత్రమే ఉందని పాల్ చెప్పారు. ఇక జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ గుండు గీయించుకునే కాపుకు ఓటేస్తారా? గుండు గీయించే కాపుకు ఓటేస్తారా? అని పాల్ ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, నాగబాబు అన్నీ ఇస్తామంటున్నారు ఎలా ఇస్తారు?అని ప్రశ్నించారు. ధనవంతురాలిని పెళ్లి చేసుకుని కట్నం తీసుకొచ్చి ఇస్తారా? అంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు ఆయన టార్గెట్ చెయ్యని నాయకుడు లేరు. ఆయన సృష్టించని సంచలనం లేదు . ఏది పడితే అది మాట్లాడి వార్తల్లో వ్యక్తిగా మారిన కేఏ పాల్ కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు విన్న వాళ్ళంతా నవ్వుకుంటున్నారు. మొత్తానికి ఏపీ ఎన్నికల్లో కేఏ పాల్ కామెడీ అదిరిపోయింది అని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+