కేసీఆర్ విశాఖ ఉక్కు కొంటానన్నది పొలిటికల్ స్టంట్; పవన్‌కళ్యాణ్ అందులో బిజీ: కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేశానని, స్టీల్ ప్లాంట్ కోసం ఎంతవరకైనా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. కానీ ఇప్పటివరకు కోర్టులో న్యాయం చేసిన అన్ని కేసుల్లోనూ విజయం సాధించానని పేర్కొన్న కెఏ పాల్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా తాను అడ్డుకుంటానని స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎవరూ కాపాడలేకపోయారు అని అసహనం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో భూములు ఇచ్చిన రైతులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కె ఏ పాల్ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రాణత్యాగం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని కె ఏ పాల్ స్పష్టం చేశారు.

ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరూ ఏమీ చేయలేకపోయారని అసహనం వ్యక్తం చేసిన కె ఏ పాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ స్టీల్ ప్లాంట్ కొంటానన్నది పొలిటికల్ స్టంట్ మాత్రమేనని పేర్కొన్నారు. ఐదులక్షల కోట్ల రూపాయలు తెచ్చి రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు చేశానని, నాలుగు వేల కోట్లు తెచ్చి స్టీల్ ప్లాంట్ కు నెలరోజుల్లో డొనేషన్ ఇస్తానని కె ఏ పాల్ తెలిపారు.
అయితే తనకు వచ్చే ఫండ్స్ రాకుండా ప్రభుత్వాలు నిలిపివేశాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలలో బిజీగా ఉన్నారని పేర్కొన్న కేఏ పాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ఎలాగూ గెలవలేదని పేర్కొన్నారు. అందుకే జనసేన, తమ పార్టీతో కలిసి పోరాటం చేయాలని సూచించారు.
ఇప్పటివరకు కాపులు ఎవరూ సీఎం కాలేదని పేర్కొన్న కే ఏ పాల్ రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నానన్నారు. ఇష్టారాజ్యంగా గంగపురం పోర్టును కూడా అమ్మేశారని అసహనం వ్యక్తం చేశారు. తాను చారిటీ కోసం ఇచ్చిన డబ్బులను రాజకీయాల కోసం వాడటం లేదని కె ఏ పాల్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications