త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8లక్షల కోట్లు తెస్తాను!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మరోమారు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం పెరగలేదని, అక్రమాలు, అప్పులు పెరిగాయని కే.ఏ పాల్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడుకట్టుకున్న అవినీతిని అంతం చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 నుండి 70 శాతం వరకు ప్రజలు తనను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని కే.ఏ పాల్ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ ప్రజలు గెలిపించారని, అలాంటిది ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తనను ఏపీ ప్రజలు ఎందుకు గెలిపించటం లేదని కే.ఏ పాల్ ప్రశ్నించారు.

త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయల తెస్తానని కే.ఏ పాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదని పేర్కొన్న కే.ఏ పాల్ చంద్రబాబు పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు . చంద్రబాబు వస్తే ఏపీని మింగేస్తాడు అని బీజేపీ పెద్దలకు తాను చెప్పానని కే.ఏ పాల్ వెల్లడించారు.
మంత్రి బొత్స సత్యనారాయణకు లక్ష కోట్ల విలువైన ఆస్తులు వచ్చాయని, వైసీపీలో అవినీతిపరులు చాలామంది ఉన్నారని ఆయన ఆరోపించారు. వైసిపి పాలనలో నాలుగు సంవత్సరాలలో అవినీతిపై సిట్ ఎందుకు చేయలేదని కే.ఏపాల్ ప్రశ్నించారు. వైసిపి నేతల అవినీతిపై సిబిఐతో కూడా ఎంక్వైరీ చేయించాలని కే.ఏ పాల్ అన్నారు. బొత్స సత్యనారాయణ ఆస్తులపై సిట్ అధికారులతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అవినీతిపరులు అందర్నీ కచ్చితంగా విచారించాలని కె ఏ పాల్ తెలిపారు. ఏ ప్రభుత్వమైనా ఉచిత విద్యను ఎవరికైనా అందించిందా? అంటూ కే.ఏ.పాల్ ప్రశ్నించారు. తాను 17లక్షల మందికి ఉచిత విద్యను అందించానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ లాంటి ముఖ్యమంత్రి మరొకరు లేరని కే.ఏ పాల్ పేర్కొన్నారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications