వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎం మోడీని వదిలిపెట్టని కేఏ పాల్.. ఏపీ స్పెషల్ స్టేటస్, తెలంగాణా నిధులపై ప్రశ్నలవర్షం!!

|
Google Oneindia TeluguNews

కె ఏ పాల్... ఈ పేరు తెలియని వారుండరు. జాతీయంగా అంతర్జాతీయంగా అందరికీ సుపరిచితుడైన కే ఏ పాల్ రాజకీయాలలో ఏ నాయకులను వదిలి పెట్టరు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లో మంత్రులను, మాజీ మంత్రులపై విమర్శలను ఏకరువు పెట్టిన కే ఏ పాల్ తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మన్ కీ బాత్ ప్రసంగాన్ని విన్న కేఏ పాల్ తనదైన శైలిలో మోడీకి ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రధాని మోడీని టార్గెట్ చేసిన కేఏ పాల్

ప్రధాని మోడీని టార్గెట్ చేసిన కేఏ పాల్

ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా లో విడుదల చేసిన ఒక వీడియోలో కె ఏ పాల్ ప్రధానినరేంద్ర మోడీ జీ-20 దేశాల అధ్యక్షుడిగా ప్రపంచ శాంతి కోసం, ఐక్యత కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తారా? ఈ మాట వింటే తనకు ఆశ్చర్యంగా అనిపించింది అని కె ఏ పాల్ అన్నారు. 2007 లో మోడీ తనకు ఒక వాగ్దానం చేశారని, ఆ వాగ్దానాన్ని విస్మరించారని తనదైన శైలిలో ఈ వ్యాఖ్యలు చేశారు. నల్లధనాన్ని దేశానికి తీసుకువస్తానని, ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారని ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. అంతే కాదు 16 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని, దేశంలో ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు పోయాయి అంటూ అని పేర్కొని ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు. డాలరు రూపాయి విలువ సమానంగా అవుతుందని చెప్పారని, ఎక్కడ అయ్యిందో చూపించాలని ప్రశ్నించారు.

ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు ఇచ్చిన మాట నేరవేర్చుకున్నారా

ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు ఇచ్చిన మాట నేరవేర్చుకున్నారా


ప్రపంచ దేశాలు ఇండియాకు అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తాయని చెప్పారని, కానీ ప్రస్తుతం ప్రపంచం ఇండియాకు అప్పు ఇవ్వడానికి వెనకడుగు వేసి పారిపోతున్నాయని కె పాల్ పేర్కొన్నారు. మన చుట్టూ ఉన్న దేశాలను చైనా కొని మనకు శత్రువులను చేసిందని అప్పుడు ఏం చేశారు అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేర్చారా అంటూ నిలదీశారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. 100 స్మార్ట్ సిటీ లు కడతానని చెప్పి కట్టారా అంటూ నిలదీశారు.

దేశంలో అన్నీ సమస్యలే అన్న కేఏ పాల్

ప్రపంచ శాంతి కోసం పని చేస్తామని చెబుతున్న ప్రధాని మోడీ, దేశంలో హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు శాంతిని కోల్పోయారని, వారి శాంతి కోసం ఏమైనా పని చేశారా అంటూ ప్రశ్నించారు. దేశంలో దాదాపు 80, 90 కోట్ల రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడాలా అన్న ఆలోచనలో ఉన్నారని, ఇంటింటికి నిరుద్యోగ సమస్య వేధిస్తోందని, ఇంకా ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలంటూ కె.ఎ.పాల్ నిలదీశారు. చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ వారిపై వేసిన అదనపు భారమైన జిఎస్టి తొలగించాలని, ఇచ్చిన మాట నెరవేర్చాలని కె ఏ పాల్ విజ్ఞప్తి చేశారు.

ఏపీ తెలంగాణా రాష్ట్రాల ప్రజలకు షాకింగ్ విజ్ఞప్తి

ఏపీ తెలంగాణా రాష్ట్రాల ప్రజలకు షాకింగ్ విజ్ఞప్తి


ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు మోడీకి వత్తాసు పలికే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ పార్టీలు అవసరమా అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడీకి మద్దతుగా బీజేపీతో పాటు జగన్ పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, చంద్రబాబు పార్టీ పనిచేస్తున్నాయని ఈ పార్టీలు అవసరమా అంటూ ప్రశ్నించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మోడీ కి అనుబంధంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ పార్టీలతో దేశంలో ఎటువంటి మార్పు రాదు అని పేర్కొన్న కె ఏ పాల్ మార్పు కోసం ప్రజాశాంతి పార్టీ ని ఆదరించాలంటూ తనని ప్రధాని చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తానుప్రధాని అయితే ఈ పనులు చేస్తా అన్న కేఏ పాల్

తానుప్రధాని అయితే ఈ పనులు చేస్తా అన్న కేఏ పాల్

తాను ప్రధాని అయితే చైనాకు బుద్ధి చెబుతా అని, చుట్టుపక్కల దేశాలను మంచి చేసుకుని, రెండు వందల దేశాలను మిత్రులు చేసుకుంటానని, అభివృద్ధి చేస్తానని కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు . తనకు అవకాశం ఇస్తే దేశంలో మోడీ చేసిన అప్పులు, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా చేసిన అప్పులన్నీ తీర్చి దేశం యొక్క సత్తా చాటుదాం అని కె ఏ పాల్ తెలిపారు. అమెరికా, రష్యా లాంటి దేశాలు తమ మద్దతు లేకుండా ముందుకు సాగకుండా ఉండేలా చేస్తానని, తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడతా అని కె ఏ పాల్ తెలిపారు. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీని కూడా వదిలిపెట్టకుండా కె ఏ పాల్ తనదైన శైలిలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

English summary
KA Paul, who targeted PM Modi, asked questions on AP special status and Telangana funds. KA Paul asked to make him as prime minister and he will solve all country's problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X