షర్మిల Vs అవినాశ్ - చంద్రబాబు కీలక నిర్ణయం, బిగ్ టర్న్..!!
ఏపీ ఎన్నికల పోరు హోరా హోరీగా మారుతోంది. ఈ సారి కడప ఎంపీ స్థానంలో వైఎస్ కుటుంబ సభ్యుల మధ్యనే పోరు జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి షర్మిల - వైసీపీ నుంచి అవినాశ్ పోటీ చేస్తున్నారు. కడప ఎంపీ సీటు గెలుపు జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఇప్పటికే టీడీపీ నుంచి భూపేష్ రెడ్డిని అభ్యర్దిని ప్రకటించారు. షర్మిల బరిలోకి దిగటం ఖాయమైన తరువాత చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే ఇప్పుడు అక్కడ బిగ్ టర్న్ గా మారుతోంది.
కడపలో ఉత్కంఠ పోరు
జగన్ ఓటమే లక్ష్యంగా మూడు పార్టీల ఎన్డీఏ కూటమి ప్రచారంలోకి దిగింది. ఇటు కాంగ్రెస్ తో వామపక్షాలతో కలిసిన మరో కూటమి ఎన్నికల బరిలోకి దిగుతోంది. వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తోంది. కాంగ్రెస్ ఏపీ లో పోటీ చేసే తమ అభ్యర్దుల తొలి జాబితా ప్రకటించింది. కడప నుంచి వైసీపీ టికెట్‌పై రెండు సార్లు ఎంపీగా గెలిచిన అవినాశ్ ను తిరిగి జగన్ తమ అభ్యర్దిగా ప్రకటించారు. ఈ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనేది అవినాశ్ లక్ష్యం గా కనిపిస్తోంది. అదే సమయంలో అనూహ్యంగా పీసీసీ చీఫ్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ కుమార్తెగా తన అన్న పార్టీ అభ్యర్దిని ఓడించటమే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నారు. షర్మిల పోటీ చేస్తుంది అవినాశ్ పైనే అయినా...ఇది కడప గడ్డ పైన జగన్ వర్సస్ షర్మిల మధ్యనే పోటీగా మారుతోంది.

పార్టీల కొత్త వ్యూహాలు
వివేకా హత్య తదనంతర పరిణామాల గురించి టీడీపీ,జనసేన తో సహా షర్మిల - సునీత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తొలి సారిగా కడప గడ్డ నుంచి జగన్ వాటి పైన స్పందించారు. వివేకాను ఎవరు హత్య చేసారో ఈ జిల్లా ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు. తాజాగా తాను కడప నుంచి పోటీ చేస్తున్న విషయం ప్రకటించిన షర్మిల ఈ నిర్ణయం ద్వారా తమ కుటుంబంలో చీలక వచ్చినా...చిన్నాన్న చివరి కోరిక మేరకు తాను కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు. కడప తొలి నుంచి వైఎస్ కుటుంబానికి వైసీపీకి కంచుకోటగా ఉంది. రెండు సార్లు జగన్ ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు. అవినాశ్ 2014, 2019లో విజయం సాధించారు. ఇప్పుడు షర్మిల ఎంట్రీ తో పోటీ ఆసక్తిగా మారుతోంది.
కడప ప్రజల మద్దతెవరికి
ఇదే సమయంలో కూటమి నుంచి ఎంపీ అభ్యర్దిగా టీడీపీ నుంచి భూపేష్ పోటీ పైన తాజాగా చంద్రబాబు ఆలోచనలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. షర్మిల బరిలోకి దిగటంతో కూటమి నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని ఎంపీగా పోటీ చేయించి..భూపేష్ ను జమ్మలమడుగు అసెంబ్లీకి పోటీ చేయించాలనే అంశం పైన చర్చ చేస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా వైసీపీకి వ్యతిరేక ఓటింగ్ విషయంలో చోటు చేసుకొనే మార్పులతో వైసీపీకి చెక్ పెట్టవచ్చనే లెక్కల పైన కసరత్తు చేస్తున్నారు. షర్మిల వర్సస్ అవినాశ్ మధ్య పోటీలో తమకు కలిసి వస్తుందనే లెక్కలు వేస్తున్నారు. అయితే, గతంలో రెండు సార్లు కంటే ఈ సారి మెజార్టీ కడప ఎంపీ స్థానంలో పెరగాలని వైసీపీ టార్గెట్ గా ఫిక్స్ చేసుకుంది. దీంతో..ఇప్పుడు కడప ఎంపీ సీటు కోసం జరుగుతున్న పోరు రాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications