YS Avinash Reddy : సుప్రీంలో తేలే వరకూ ఆగండి-సీబీఐకి అవినాష్ మరో విజ్ఞప్తి...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన రెగ్యులర్ బెంచ్.. వేసవి సెలవుల దృష్ట్యా దీనిపై నిర్ణయం ప్రకటించకుండా జూన్ 5కు విచారణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో వెకేషన్ బెంచ్ కు వెళ్లొచ్చని కూడా సూచించింది. ఈ నేపథ్యంలో వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించిన అవినాష్.. సీబీఐకి కూడా మరో కీలక విజ్ఞప్తి చేశారు.

అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణకు నిరాకరించినప్పటికీ.. రేపు మెన్షన్ చేయించుకోవాలని సూచించింది. దీంతో అవినాష్ రెడ్డి కర్నూలు ఆస్పత్రి నుంచే సీబీఐ అధికారులకు రెండో లేఖ రాశారు. ఇందులో సీబీఐ అధికారులకు ఆయన కీలక విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. సీబీఐ ఇవాళ విచారణకు రావాలని తనను కోరిన నేపథ్యంలో ఆస్పత్రిలోనే ఉండాల్సిన పరిస్దితుల్లో తాను సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు.

 avinash-supreme

సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ లో విచారణ కోసం తాను బెయిల్ పిటిషన్ వేసిన నేపథ్యంలో అది విచారణ జరిగే వరకూ తనపై ఎలాంటి దూకుడు చర్యలు తీసుకోవద్దని సీబీఐని అవినాష్ రెడ్డి సీబీఐని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీబీఐ అదనపు ఎస్పీకి లేఖ రాశారు. ఈ లేఖలో సుప్రీంకోర్టులో విచారణ పూర్తయి నిర్ణయం వచ్చే వరకూ తనను విచారణకు పిలవడం, అరెస్టు వంటి చర్యలకు దిగొద్దని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై సీబీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇవాళ ఉదయం కూడా సీబీఐకి అవినాష్ ఓ లేఖ రాశారు. ఇందులో తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం, తండ్రి రిమాండ్ లో ఉండటంతో వారం రోజుల పాటు విచారణ వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సీబీఐ ఆయన్ను ముందుగా లొంగిపోవాలని కోరుతూ స్ధానిక ఎస్పీ సహకారంతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన అవినాష్.. దీని ఆధారంగా విచారణ వాయిదా కోరినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+