రుణమాఫీ ఎగ్గొడితే చంద్రబాబునెందుకు ప్రశ్నించలేదు ? క్రాప్ హాలిడే వెనుక రహస్య అజెండా-కాకాణి

ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న రాజకీయ క్రీడలో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కోనసీమలో క్రాప్ హాలిడేపై చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇవాళ తీవ్రంగా స్పందించారు. క్రాప్ హాలిడే వ్యాఖ్యలతో పాటు పవన్-చంద్రబాబు పొత్తు ప్రయత్నాలపైనా ఆయన ఫైర్ అయ్యారు.

చంద్రబాబు రుణమాఫీ ఎగ్గొడితే పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించ లేదని వ్యవసాయ మంత్రి కాకాణి నిలదీశారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా చంద్రబాబుకు లేదని ఆయన ప్రశ్నించారు. క్రాప్‌ హాలిడేపై పవన్ వ్యాఖ్యలు వెనుక రహస్య ఎజెండా ఉందన్నారు. క్రాప్‌ హాలిడే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం గురించి పవన్ ఏనాడైనా ఆలోచించాడా అని కాకాణి అడిగారు.

 kakani govardhan reddy ask pawan kalyan on why he didnt question babu on loan waiver

రైతాంగానికి లక్షా 10వేల కోట్లు సాయం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని కాకాణి వెల్లడించారు. ఈ నెల 14న రూ.3వేల కోట్ల క్రాప్‌ ఇన్సూరెన్స్‌ ఇస్తున్నామన్నారు. పవన్ కల్యాణ్ ముమ్మాటికీ చంద్రబాబు దత్త పుత్రుడేనని కాకాణి అన్నారు. స్క్రిప్ట్‌లు చదివే వ్యక్తి రైతుల గురించి మాట్లాడటమా అని ఆక్షేపించారు. ప్యాకేజీ ఓకే కావడంతోనే చంద్రబాబు స్క్రిప్ట్‌కు పవన్ డప్పు కొడుతున్నాడన్నారు. రైతులకు ఉచిత సాధ్యం కాదని చంద్రబాబు చెప్పలేదా అని కాకాణి నిలదీశారు. సీఎం జగన్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.

పదో తరగతి ఫెయిల్ క్యాండిడెట్ లోకేష్ పదో తరగతి విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇస్తాడట అంటూ కాకాణి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడడు,రుతు పవనాలు కర్ణాటక బోర్డర్‌లో ఆగిపోయాయని కాకాణి తెలిపారు. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాం.. దయచేసి రైతుల గురించి మాట్లాడొద్దని కాకాణి సూచించారు. రైతులను రెచ్చగొట్టే విధానాలకు పవన్‌, చంద్రబాబు స్వస్తి పలికితే మంచిదన్నారు. పవన్ కల్యాణ్‌ను చూసి చిన్న పిల్లలే భయ పడరు..మేం ఎందుకు భయపడతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+