10 లక్షల ఏటీఎం డబ్బుతో పరార్: ఆత్మహత్య, మిస్టరీగా మారిన భరణి మరణం

అమరావతి: ఏటీఎంలో పెట్టాల్సిన రూ. 10 లక్షల డబ్బుతో పరారైన సీఎంఎస్ సంస్ధకు చెందిన దుర్గా భరణికుమార్‌ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర సోమవారం వెలుగు చూసింది. ఈ ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

సీఎంఎస్ సంస్ధకు చెందిన ఉద్యోగి దుర్గా భరణికుమార్‌‌కు ఆదివారం ఉదయం ఏటీఎంలో నగదు పెట్టేందుకు అతని చేతికి రూ. 10 లక్షల నగదు అప్పగించింది. అయితే, అతడు ఏటీఎంలో నగదు పెట్టుకుండా అటునుంచే అటే ఆ డబ్బుతో పారిపోయాడు. దాంతో సీఎంఎస్ సంస్థ యజమాని పోలీసు స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు.

చీటింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దుర్గా భరణికుమార్ కాకినాడలోని ఏటీఎంలో పెట్టాల్సిన రూ. 10 లక్షల నగదును తన సొంత అవసరాలకు వాడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు భరణికుమార్ కోసం గాలిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని భరణి కొవ్వూరు సమీపంలోని గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

kakinada atm thief commits suicide in river godavari

అయితే ఏటీఎం డబ్బును తాను చోరీ చేయలేదని, కేవలం రూ. 60 వేలు మాత్రమే తన అవసరానికి వాడుుకున్నట్టు భరణి కుమార్ ఆత్మహత్య చేసుకునేముందు సోదరుడికి మెసేజ్ పంపాడు. అమ్మను బాగా చూసుకోవాల్సిందిగా సోదరుడిని ఆ మేసేజ్‌లో కోరాడు. కాగా, ఏటీఎం డబ్బు రూ. 10 లక్షలను భరణి కుమార్ చోరీ చేసినట్టు వచ్చిన వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు.

సంస్థ తమ కుమారుడిపై తప్పుడు ఫిర్యాదు చేసిందని వారు చెబుతున్నారు. దీంతో భరణి కుమార్ మరణం మిస్టరీగా మారింది. అయితే ఏటీఎంలో పెట్టమని భరణి కుమార్‌కు ఇచ్చిన సొమ్ము రూ. 10 లక్షలు ఎటు పోయింది, దాని వెనుక ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+