వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడలో టీడీపీ బంపర్ విక్టరీ: 32డివిజన్లలో జయకేతనం, చతికిలపడ్డ వైసీపీ!

కాకినాడ కార్పోరేషన్ ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. తొలి నుంచి ఏ దశలోను వైసీపీ టీడీపీకి గట్టి పోటీనివ్వలేదు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Kakinada Municipal Corporation Poll Results Update : TDP Confident Of Winning | Oneindia Telugu

కాకినాడ:కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ జయకేతనం ఎగరవేసింది. తొలి నుంచి ఏ దశలోను వైసీపీ టీడీపీకి గట్టి పోటీనివ్వలేదు. దీంతో ఫలితాలన్ని ఏకపక్షంగా వెల్లడవుతూ వచ్చాయి. పూర్తి స్థాయి కౌంటింగ్ ముగిసేసరికి టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని కార్పోరేషన్‌ను సొంతం చేసుకుంది.

30ఏళ్ల తర్వాత కాకినాడ మేయర్ పీఠాన్ని టీడీపీ దక్కించుకోవడం విశేషం. తొలి నుంచి పూర్తి ఆధిక్యం కనబరుస్తూ వచ్చిన టీడీపీ.. మూడు రౌండ్లలోను తన సత్తా చాటింది. మొత్తం 48డివిజన్లలో మిత్రపక్షంతో కలిసి టీడీపీ 35స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ 10డివిజన్లలో, బీజేపీ 3డివిజన్లలో, స్వంతంత్ర అభ్యర్థులు 3డివిజన్లలో విజయం సాధించారు.

హైలైట్స్:

48డివిజన్లలో టీడీపీ-32, వైసీపీ-10, బీజేపీ-3,స్వంతత్ర అభ్యర్థులు-3 స్థానాల్లో గెలుపు.

35వ డివిజన్‌లో బి. రామకృష్ణ (ఇండిపెండెంట్), 29వ డివిజన్‌లో వాసిరెడ్డి రాంబాబు (ఇండిపెండెంట్) గెలుపొందారు.

కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు సోదరుడు సత్యనారాయణ కుమారుడు ప్రసాద్ 23వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి మీసాల శ్రీదేవిపై ఓటమిపాలయ్యాడు.

37వ డివిజన్ లో టీడీపీ అభ్యర్థి హేమలత 1400పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీ.

టీడీపీ అభ్యర్థి శేషకుమారి శేషుకుమారి అత్యల్పంగా 30పైచిలుకు ఓట్ల మెజారిటితో గెలుపు

గెలుపొందిన అభ్యర్థులు:

1వ డివిజన్ పేరాబత్తుల లోవబాబు(టీడీపీ),7వ డివిజన్ అంబటి క్రాంతి,19వ డివిజన్ అనంతకుమార్(టీడీపీ), 34వ డివిజన్ తహేర్ ఖాతూన్ (టీడీపీ), 31వ డివిజన్ బంగారు సత్యవతి (టీడీపీ), 10వ డివిజన్ మోసా దానమ్మ(టీడీపీ), 4వ డివిజన్ సూర్యకుమారి (వైసీపీ),40వ డివిజన్ శివప్రసన్న (టీడీపీ),22వ డివిజన్ జాన్ కిశోర్ (వైసీపీ),

37వ కర్రి దేవిక (వైసీపీ), 28వ వార్డు సుంకర పావని (టీడీపీ), 16వ డివిజన్ మల్లాడి గంగాధర్(టీడీపీ), 13వ డివిజన్ కామేశ్వరరావు(టీడీపీ), 5వార్డు కాళ్ల సత్తిబాబు, 14వ వార్డు వనమాడి ఉమాశంకర్(టీడీపీ), 29వ డివిజన్ టీడీపీ రెబల్ రామచంద్రరావు, 35డివిజన్ టీడీపీ రెబల్ రామకృష్ణ, 23వ డివిజన్ మీసాల శ్రీదేవి( వైసీపీ),

15వ డివిజన్ పినబోతు సత్తిబాబు(వైసీపీ)
5వ డివిజన్ నల్లబిల్లి సుజాత(బీజేపీ, 17వ డివిజన్ సత్యప్రసాద్(టీడీపీ), 20వ డివిజన్ నాగసత్యనారాయణ(టీడీపీ), 12వ వార్డు తుమ్మల సునీత(టీడీపీ), 28వ డివిజన్ సుంకర పావని(టీడీపీ), 32వ డివిజన్ రోకళ్ల సత్యనారాయణ, 9వ డివిజన్ కంపర రమేశ్ (వైసీపీ), 27వ డివిజన్ మంగారత్నం, 38వ డివిజన్ శేషుకుమారి(టీడీపీ)

రెండో రౌండ్ ఏకపక్షం:

కాకినాడ కార్పోరేషన్ రెండో రౌండ్ లోను టీడీపీకే ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయి. 28డివిజన్లలో కౌంటింగ్ పూర్తవగా.. టీడీపీ 21, వైసీపీ 3, ఇండిపెండెంట్లు 2, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. మూడో రౌండ్ కౌటింగ్ ప్రారంభమవడంతో.. ఈ రౌండ్‌లోనైనా తమ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయా? అని వైసీపీ ఎదురుచూస్తోంది.

తొలి రౌండ్‌లో టీడీపీకి 12స్థానాలు:

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్ లో తొలి రౌండ్ పూర్తయేసరికి టీడీపీ 12డివిజన్లలో విజయం సాధించింది. వైసీపీ కేవలం 2డివిజన్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. తొలి రౌండ్ తర్వాత ప్రారంభమైన రెండో రౌండ్ లోను టీడీపీదే హవా కొనసాగుతుండటంతో ఫలితాలు ఆ పార్టీకే పట్టం కడుతాయా? అన్న అంచనాలు పెరిగిపోతున్నాయి.

తొలి రౌండ్:

కాకినాడ కార్పోరేషన్ తొలి రౌండ్‌లో టీడీపీ హవా కొనసాగుతోంది. తొలి నుంచి ఆధిక్యం కనబరుస్తూ వచ్చిన 12డివిజన్లలోను టీడీపీ విజయం సాధించింది. 1, 7, 10, 13, 19, 25, 28, 31, 34, 40డివిజన్లలో ప్రత్యర్థులపై టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. రెండో రౌండ్‌‌లో మరో 5చోట్ల టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

మరోవైపు 4,22,37డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయానికి చేరువలో ఉన్నారు.కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు సోదరుడు ఓటమిపాలవడం గమనార్హం.

తొలి రౌండ్ నుంచే టీడీపీ దూకుడు:

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ తొలి రౌండ్‌లో టీడీపీ ముందంజలో కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభంలో ఆరు డివిజన్లలో ఆధిక్యం కనబరిచిన టీడీపీ.. అంతకంతకూ దాని సంఖ్యను పెంచుకుంటూ పోతోంది.

9 నుంచి 10డివిజన్లలో టీడీపీ ఆధిక్యం కనబరుస్తోంది.1, 7, 10, 13, 19, 25, 28, 31, 34, 40డివిజన్లలో టీడీపీ ముందంజలో కొనసాగుతుండగా.. 4,6, 22, 37 డివిజన్లలో వైసీపీ ముందంజలో ఉంది.

11గం. వరకు పూర్తి ఫలితం:

కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 11గం. వరకు పూర్తి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉండగా.. ప్రధాన పార్టీలైన టీడీపీ-వైసీపీ మధ్యే టఫ్ ఫైట్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. నంద్యాలలో ఓటమికి కాకినాడ ద్వారా బదులు తీర్చుకోవాలని వైసీపీ ఎదురుచూస్తోంది.

ఒకవేళ కాకినాడలోను ఫలితం వైసీపీకి ప్రతికూలంగా వెలువడితే మాత్రం రాజకీయంగా ఆ పార్టీకి కొత్త కష్టాలు తప్పవు. అలా గాక ఫలితం వైసీపీకి అనుకూలంగా వస్తే మాత్రం నంద్యాల ఓటమి నుంచి తేరుకోవడానికి ఆ పార్టీకి ఇదొక ఊరటలా పనిచేస్తుంది.

kakinada corporation results today: counting begins

కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1,48,000వేల మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. దాదాపు 68శాతం ఓటింగ్ నమోదైంది. 30కి పైగా సీట్లను సాధిస్తామని అటు టీడీపీ, మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఇటు వైసీపీ నమ్మకంతో ఉన్నాయి.

దాదాపు ఏడేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.రూరల్-అర్బన్ ఓటర్ల మనోగతం పైనే ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. ఎవరు ఎవరి వైపు ఉన్నారనేది ఉదయం 9గం. వరకు చూచాయగా తెలిసే అవకాశం కనిపిస్తోంది.

English summary
The counting of votes polled during the high-stakes Kakinada corporation election counting began on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X