కళ్లు గప్పి తిరుగుతున్న కళానికేతన్ ఎండి అరెస్టు
అనంతపురం: కళానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ వేములూరి లీలాకుమార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. లీలాకుమార్‌ను అరెస్టు చేసిన విషయాన్ని ధర్మవరం పట్టణ పోలీసుస్టేషన్లో డీఎస్పీ వేణు గోపాల్ తెలిపారు.
కళానికేతన్ టెక్స్టైల్ సంస్థ ధర్మవరంలోని పట్టుచీరల వ్యాపారుల నుంచి రూ.4,14,71,000 విలువ చేసే పట్టు చీరలను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన డబ్బు చెల్లించక పోవడంతో వ్యాపారులు ధర్మవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ధర్మవరంలో కళానికేతన్ సంస్థ ఎండీపై 14 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో మౌర్య హోటల్లో ఉన్న లీలాకుమార్ని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. లీలాకుమార్ని ధర్మవరం కోర్టులో హాజరుపరచారు దాంతో అతనికి కోర్టు 14రోజుల రిమాండు విధించింది.
ఎండీ లీలా కుమార్, డైరెక్టర్ లక్ష్మీశారద, అడిషనల్ డైరెక్టర్లు రాజకృష్ణ, వెంకటరవిప్రసాద్ల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంస్థ డైరెక్టర్ లక్ష్మీశారదను పోలీసులు ఆ మధ్య క్రితం హైదరాబాదులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
-
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications