బొత్స భ్రష్టు పట్టించారు: కళా, బాబుదంతా ప్రచారమేనన్న పార్థసారథి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బొత్స సత్యనారాయణ రాజకీయాలను భ్రష్టుపట్టించారని తెలుగుదేశం పార్టీ నేత కళావెంకట్రావు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి వరకు జగన్ అవినీతిపరుడని విమర్శించిన బొత్స ఇప్పుడు ఆయన పార్టీలోనే చేరారని కళా వెంకట్రావు అన్నారు.
మద్యం మాఫియాతో బొత్సకు సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. పదవులు పొందడం, డబ్పు సంపాదించుకోవడం తప్ప బొత్స వల్ల రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని కళా వెంకట్రావు విమర్శించారు. బొత్స సత్యనారాయణపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రైతులను మోసం చేసినట్టే మున్సిపల్ కార్మికులను కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పార్థసారథి విమర్శించారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని , సీఎం చంద్రబాబు ప్రచారానికి ఇచ్చినంత ప్రాధాన్యం అభివద్ధికివ్వడం లేదని ఆయన అన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications