80 శాతం మంది కాపులు టిడిపికి ఓటేశారు: బాబును కలిసిన కళా
ఏపీ టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. తనకు అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి: ఏపీ టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. తనకు అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం కళా మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో అభివృద్ధిని చూసే ప్రజలు ఓటు వేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలు టిడిపి వైపు ఉన్నారని మరోసారి తేటతెల్లమైందన్నారు.

కాకినాడ ఎన్నికలతో కాపులు టిడిపి వెంటే ఉన్నారని తేలిపోయిందని చెప్పారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. కాకినాడ ఎన్నికల్లో 80 శాతం కాపుల ఓట్లు టిడిపికే పడ్డాయన్నారు.












Click it and Unblock the Notifications