పవన్‌కు తిక్కే ఉంది, లెక్క లేదు: కవిత, చిరుపైనా

హైదరాబాద్: జనసేన అధినేత, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ లోకసభ అభ్యర్థి, పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌పైనే కాకుండా కాంగ్రెసు నాయకుడు, కేంద్ర మంత్రి చిరంజీవిపై కూడా విరుచుకపడ్డారు.

పవన్ కళ్యాణ్‌కు తిక్కే ఉంది గానీ లెక్క లేదని ఆమె వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తారనే భ్రమలో పవన్ కళ్యాణ్ బిజెపి నేత నరేంద్ర మోడీ పక్కన చేరారని ఆమె వ్యాఖ్యానించారు. ఇది సినిమా కాదని, రీటేకులు ఉండడానికి అని ఆమె అన్నారు.

Kalwakuntla Kavitha lashes out at Pawan Kalyan

పవన్ కళ్యాణ్ పిచ్చివాడిలా మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలను ప్రజలు నమ్మబోరని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కమెడియన్లు, విలన్లు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లేనని ఆమె అన్నారు. ప్రజారాజ్యం టికెట్లు అమ్ముకున్న సొమ్ములో పవన్ కళ్యాణ్‌కు ఎంత వాటా దక్కిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై, ఆ పార్టీ అధినేత కెసిఆర్‌పై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కెసిఆర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ మాటల యుద్ధం చెలరేగిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+