పోటీ పడలేకే ట్యాపింగ్: రామ్మోహన్, డబ్బు ఇస్తామని చెప్పలేదన్న జెసి
చిత్తూరు: అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోటీ పడలేక.. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు అన్నారు. ఆయన శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తలనీలాలు సమర్పించి ప్రముఖుల ప్రారంభ దర్శన సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. కంభంపాటికి తితిదే అధికారులు స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల కంభంపాటి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి వస్తున్న ప్రజాదరణను చూసి వోర్వలేక, అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడలేక.. ప్రజాదరణను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని కంభంపాటి ఆరోపించారు.
రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చంద్రబాబు కోరుకుంటుంటే.. తెలంగాణ సీఎం మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని నిందించడం మంచిదికాదని కంభంపాటి రామ్మోహనరావు అన్నారు.

డబ్బులిస్తామని ఎక్కడా చెప్పలేదు: జెసి
ఓటకు నోటు వ్యవహారంపై తాడిపత్రి టిడిపి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి శనివారం అనంతపురంలో స్పందించారు. డబ్బులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడియోలో ఎక్కడా వ్యాఖ్యానించలేదన్నారు. ధైర్యం, భరోసా ఇవ్వడం చంద్రబాబుకు అలవాటని ఆయన గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డిని పట్టుకున్నప్పుడే చంద్రబాబు ఆడియో టేపులు ఎందుకు విడుదల చేయలేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విలువలు గుర్తు రాలేదా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications