‘బతికుండగానే చంపేస్తారా?, పని చేతకాకపోతే వెళ్లిపోండి’

గుంటూరు: జీజీహెచ్‌ వైద్యుల నిర్లక్ష్యంపై ఆంధప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయడం చేతకాకుంటే సెలవుపై వెళ్ళిపోవాలని సూపరింటెండెంట్ రాజునాయుడుకి కామినేని సూచించారు.

మంగళవారం ఆస్పత్రిలోని ఓ చిన్నారిని బతికుండగానే చనిపోయడంటూ పంపించేసిన వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయాలని, ఘటనపై క్షేత్రస్థాయి విచారణ జరపాలని డీఎంఈని మంత్రి ఆదేశించారు.

 Kamineni fires at GGH doctors

ఆయన బుధవారం ఉదయం జీజీహెచ్‌లో పర్యటించి, ఆస్పత్రిని పరిశీలించారు. ఘటనకు సంబంధించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీజీహెచ్‌లో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంపై ఆయన ఆస్పత్రి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. కాగా, మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో నలుగురు వైద్యులపై వేటు పడింది. ఇది ఇలా ఉండగా, గతంలో ఓ శిశువును ఈ ఆస్పత్రిలోనే ఎలుకలు కొరికి చంపిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+