చంద్రబాబుకు ఇష్టం లేదు.. పవనే కలిపాడు - కామినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ వర్సెస్ ఎన్డీయే కూటమి మధ్య మాటల యుద్దం సాగుతోంది. అదే సమయంలో ఎన్డీయే కూటమిని వైసీపీకి దీటుగా తయారుచేసేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలపైనా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది ముఖ్యంగా చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిదంటూ టీడీపీ నేతలు కూడా అక్కడక్కడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కూడా ఈ వాదనకు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీతో పొత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలను ఆ పార్టీ కైకలూరు అభ్యర్ధి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇవాళ మరోసారి గుర్తుచేసుకున్నారు. పవన్ వల్లే తాను కైకలూరులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు కామినేని తెలిపారు. ఆయనే బీజేపీని టీడీపీతో కలిపారని గుర్తుచేశారు. ఆయన తగ్గి మరీ ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేశారన్నారు. సీట్లు ఎన్నో కూడా అడక్కుండా కూటమిలో పార్టీల్ని కలిపారన్నారు.

కామినేని శ్రీనివాస్ గారు (బీజేపీ) 👍 pic.twitter.com/4NYZvqJWKF
— SKY (@SriKanthY_) April 11, 2024
పవన్ కళ్యాణ్ సినిమాల్లో కాదని నిజ జీవితంలో హీరో అని కామినేని శ్రీనివాస్ పొగడ్తల జల్లు కురిపించారు. జగన్ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు పవన్ ఈ కూటమిని ఏర్పాటు చేశారన్నారు. జగన్ దురాగతాలను అడ్డుకునేందుకే పవన్ తనకు తాను తగ్గించుకుని ఎన్డీయే కూటమి ఏర్పాటు చేశారని కామినేని శ్రీనివాస్ గుర్తుచేసుకున్నారు. దీంతో ఇప్పుడు కామినేని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.












Click it and Unblock the Notifications