విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో మరోసారి కమ్మ-కాపు చిచ్చు ? ఎన్టీఆర్ వర్సెస్ రంగా పేర్లతో-టార్గెట్ వైసీపీ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన ప్రక్రియలో పలు చోట్ల వివాదాలు తప్పడం లేదు. ముఖ్యంగా రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని జగన్ హామీ పేరుతో వైసీపీ సమర్ధించుకుంటుండగా.. టీడీపీలో, బయట ఉన్న కాపు సామాజిక వర్గ నేతలు మాత్రం వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో బెజవాడ కేంద్రంగా గతంలో సాగిన కాపు-కమ్మ పోరు మరోసారి తెరపైకి వస్తోంది.

 విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు

విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు

కృష్ణాజిల్లాలో పుట్టి తెలుగు సినీ చిత్ర పరిశ్రమతో పాటు ఏపీ రాజకీయాల్ని సుదీర్ఘకాలంపాటు ప్రభావితం చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ పేరును జిల్లాల విభజనలో ఓ జిల్లాకు పెడతానంటూ గతంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీని ప్రకారం తాజాగా చేపట్టిన జిల్లాల విభజన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టింది. దీంతో వివాదం మొదలైంది. ఇక్కడ ప్రభావం చూపే స్దాయిలో ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాపు సామాజిక వర్గం మండిపడుతోంది. దీంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తావిస్తోంది.

వంగవీటి రంగా పేరుకు కాపుల డిమాండ్

వంగవీటి రంగా పేరుకు కాపుల డిమాండ్

ఇదే కృష్ణాజిల్లాలో, అదీ బెజవాడలో పుట్టి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ చరిత్ర లిఖించుకున్న మరో దివంగత నేత వంగవీటి మోహన రంగాకు ఇప్పటికీ ఎంతో ఆదరణ ఉంది. ముఖ్యంగా విజయవాడలో కాపులతో పాలు అణగారిన వర్గాలకు అండగా నిలిచిన చరిత్ర కలిగిన రంగా పేరుతో రాజకీయాలు కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లా విజయవాడకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని ఆయన సామాజికవర్గం కాపులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో వైసీపీ ఇరుకునపడుతోంది.

మచిలీపట్నానికి ఎన్టీఆర్-విజయవాడకు రంగా

మచిలీపట్నానికి ఎన్టీఆర్-విజయవాడకు రంగా

వాస్తవానికి ఎన్టీఆర్ పుట్టింది మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నిమ్మకూరు గ్రామంలో. ఆయన స్వగ్రామం ఉన్న మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తున్నప్పుడు దానికి ఎన్టీఆర్ పేరు పెట్టకుండా విజయవాడ జిల్లాకు పెట్టడం వెనుక వైసీపీ ఉద్దేశమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ భారీ సంఖ్యలో ప్రభావం చూపే కమ్మ సామాజిక వర్గ జనాభాను ఆకట్టుకునేందుకు జగన్ తీసుకున్న నిర్ణయం కాపులకు మాత్రం రుచించడం లేదు.

దీంతో ఈ వ్యవహారాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాపుల్లో ఉన్న అసంతృుప్తిని సొమ్ము చేసుకునేందుకు పార్టీ నేత బోండా ఉమను రంగంలోకి దింపింది. దీంతో వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పుడు మచిలీపట్నానికి ఎన్టీఆర్ పేరు పెట్టి విజయవాడకు రంగా పేరు పెట్టాలని కోరుతున్నారు.

బెజవాడలో మళ్లీ కమ్మ-కాపు చిచ్చు?

బెజవాడలో మళ్లీ కమ్మ-కాపు చిచ్చు?

వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజన ప్రక్రియ నేపథ్యంలో విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని కాపు సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. దీంతో కమ్మ సామాజిక వర్గానికి జగన్ అండగా నిలవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకు రంగా పేరు పెట్టి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కానీ పేరు మారిస్తే ఊరుకోబోమని కమ్మ సామాజిక వర్గం చెబుతోంది. దీంతో జిల్లాల పేర్ల కేంద్రంగా కమ్మ-కాపు చిచ్చు రాజుకుంటోంది.

గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన రంగా హత్య తర్వాత కమ్మ-కాపు చిచ్చు చాలా ఏళ్ల పాటు కొనసాగింది. ఇప్పుడు ఎన్టీఆర్ పేరును బెజవాడకు పెడితే ఆ కాపుల్లో మరోసారి కమ్మ సామాజిక వర్గంపై ఆగ్రహం పెల్లుబికే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో క్షేత్రస్ధాయిలో పరిస్ధితుల్ని వైసీపీ నిశితంగా గమనిస్తోంది. కమ్మ-కాపు పేరు తప్పదని తేలితే మాత్రం విజయవాడకు బదులుగా మచిలీపట్నానికి ఎన్టీఆర్ పేరు మార్చే అంశాన్ని కూడా వైసీపీ సర్కార్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
ysrcp govt's decision to put name to vijayawada district seems to create another war between kapu and kamma communities in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X