జయేంద్ర సరస్వతికి సీరియస్.. ఐసీయూలో చేరిక
విజయవాడ : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో సూర్యారావు పేటలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రా ఆసుపత్రిలోని హార్ట్ అండ్ బ్రెయిన్ విభాగంలో ఉన్న ఐసీయూలో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

కాగా, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు జయేంద్ర సరస్వతి. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రా ఆసుపత్రి వైద్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఐదుగురు వైద్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రా ఆసుపత్రి అధినేత డాక్టర్ పీవీ రమణమూర్తి తెలిపారు.












Click it and Unblock the Notifications