బీజేపీకి కన్నాలక్ష్మీనారాయణ రాజీనామా - టీడీపీలోకి ఎంట్రీ..!?

బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాజీనామా చేసారు. టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం.

బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసారు. తన ముఖ్య అనుచరులతో సమావేశమైన కన్నా...తాను బీజేపీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. కొద్ది రోజులుగా బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన మనస్థాపంతో ఉన్న కన్నా..ఆ పార్టీ ముఖ్య నేతలతోనూ సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేసే దిశగా రాష్ట్రంలో నిర్ణయాలు జరగటం లేదని ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు పైన గుర్రుగా ఉన్నారు. అయితే, కన్నా జనసేనలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం సాగింది. ఇప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్దంచేసుకున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాకు కన్నా తన రాజీనామా లేఖ పంపారు.

బీజేపీకి కన్నా రాజీనామా

బీజేపీకి కన్నా రాజీనామా


బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసారు. సీనియర్ రాజకీయ నేతగా.. మంత్రిగా సుదీర్ఘ కాలం పని చేసిన కన్నా ..రాష్ట్ర విభజన తరువాత బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసారు. కన్నా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జనసేనతో పొత్తు ఖరారైంది. కన్నా అధ్యక్షతనే బీజేపీ 2019 ఎన్నికలను ఎదుర్కొంది. ఆ ఎన్నికల్లో కన్నా కూడా పోటీ చేసి ఓడిపోయారు. కన్నా స్థానంలో సోమ వీర్రాజును పార్టీ అధినాయకత్వం ఏపీ బాధ్యతలు అప్పగించింది. కానీ, కన్నా పార్టీ లో జరుగుతున్న పరిణామాలతో యాక్టివ్ గా బీజేపీ కార్యక్రమాలకు క్రమేణా దూరమయ్యారు. కన్నా నిర్ణయాలను సోము వీర్రాజు మార్చటం.. నియామకాలను రద్దు చేయటం తో కన్నా మనస్థాపానికి గురయ్యారు. రాజీనామా నిర్ణయం ప్రకటించిన కన్నా..తమకు ప్రధాని మోదీ పైన పూర్తి అభిమానం ఉందన్నారు. ఓవర్ నైట్ నాయకుడు కావాలని అనుకునే వారికి రంగా విగ్రహం..కాపు రిజర్వేషన్లు అంశం ఉపయోగించుకుంటున్నారని కన్నా వ్యాఖ్యానించారు.

జనసేన లోకి వెళ్తారంటూ ప్రచారం

జనసేన లోకి వెళ్తారంటూ ప్రచారం


సోము వీర్రాజు తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.ఈ సమయంలో బీజేపీ అధినాయకత్వం జోక్యం చేసుకుంది. కన్నాతో నేరుగా మంతనాలు జరిపింది. పార్టీ వీడే ఆలోచన లేదని కన్నా పార్టీ ముఖ్య నేతలతో చెప్పుకొచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడితో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని పార్టీ నేతలు కన్నాకు హామీ ఇచ్చారు. దీంతో..కన్నా కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు. కానీ, ఇప్పుడు బీజేపీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో కన్నా తన రాజకీయ భవిష్యత్ పైన ఆలోచన ప్రారంభించారు. అందులో భాగంగా తన అనుచర వర్గంతో సమావేశం అయ్యారు. పార్టీలో గుర్తింపు లేని సమయంలో బీజేపీలో కొనసాగాల్సిన అవసరం లేదని అనుచర వర్గం కన్నాకు స్పష్టం చేసారు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని అనుచర వర్గం హామీ ఇచ్చింది. అదే సమయంలో కన్నా ఇక జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది. కన్నా కూడా కొంత కాలంగా జనసేనాని పవన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసారు. దీంతో..కన్నా ఖచ్చితంగా జనసేనలోకి వెళ్తారని భావించారు.

టీడీపీలోకి ఎంట్రీ కి రంగం సిద్దం..!

టీడీపీలోకి ఎంట్రీ కి రంగం సిద్దం..!


కానీ, కన్నా టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించినట్లుగా విశ్వససనీయ సమాచారం. ఈ నెల 23 లేదా 24 తేదీల్లో కన్నా టీడీపీలో అధికారికంగా చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పెదకూరపాడు, గుంటూరు పశ్చిమం నుంచి కన్నా లక్ష్మీనారాయణ గతంలో గెలుపొందారు. ఇప్పుడు టీడీపీలో చేరటం ద్వారా గుంటూరు పశ్చిమం లేదా పెదకూరపాడు నుంచి తిరిగి పోటీ చేస్తారని..ఈ మేరకు హామీ లభించిందని చెబుతున్నారు. దీని పైన కన్నా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఇదే సమయంలో కన్నా బీజేపీకి రాజీనామా పైన ఆ పార్టీ జీవీఎల్ స్పందించేందుకు నిరాకరించారు. ఇప్పుడు కన్నా రాజీనామా పైన పార్టీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+