ఏపీలో సెంట్రలైజ్డ్ అవినీతి , వైఎస్సార్ నిర్ణయాన్నే కాదని జగన్ రహస్య పాలన : కన్నా లక్ష్మీనారాయణ ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవోల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దుమారంగా మారింది. ప్రభుత్వ వెబ్ సైట్ లలో జీవోలను పెట్టొద్దు అంటూ ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై బిజెపి నాయకులు కన్నా లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రహస్య పాలన కోసమే ఆఫ్ లైన్ జీవోలు
వైయస్సార్ హయాంలో తీసుకువచ్చిన ఆన్లైన్ జీవోల విధానాన్ని మారుస్తూ ఆఫ్లైన్ జీవోలను విడుదల చేసే విధానానికి జగన్ సర్కారు శ్రీకారం చుట్టిందని నిప్పులు చెరిగారు. తండ్రి నిర్ణయాన్నే కాదన్న తనయుడు అంటూ జగన్ మోహన్ రెడ్డి పై కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. ఏపీలో సెంట్రలైజ్డ్ అవినీతి జరుగుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు .50 ఏళ్లలో ఇలాంటి అవినీతిని ఎప్పుడూ చూడలేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 2008లో వైయస్సార్ తెచ్చిన ఆన్లైన్ జీవోల విధానాన్ని జగన్ నిలిపివేశారని పేర్కొన్న కన్నా లక్ష్మీనారాయణ, రహస్య పాలన నడపాలి అని ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు.

ప్రజలకు డబ్బులు పంచినా వారు అన్నీ గమనిస్తున్నారని వార్నింగ్
రాష్ట్రంలో ప్రతిపక్షాల పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతుందని, ప్రశ్నించే ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంతకు ముందు శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేవని, కానీ ఇప్పుడు సిఐడి మాత్రమే పటిష్టంగా ఉందని, శాంతి భద్రతలు లేవని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రజలకు డబ్బులు పంచుతున్నాం కదా అనుకుంటే సరిపోదు అని వాళ్లు అన్నిటినీ గమనిస్తున్నారని వైసీపీ ప్రభుత్వానికి కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరికలు జారీ చేశారు.

రాజధాని ఎక్కడా అంటే చెప్పలేని స్థితి
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కేవలం ప్రతిపక్షాలను అణగదొక్కడం కోసమే పని చేస్తుందని విమర్శించిన కన్నా లక్ష్మీనారాయణ, ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్టులు, హౌస్ అరెస్టు నిత్యకృత్యంగా మారాయి అని ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు రాజధాని ఎక్కడ అంటే చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజధాని ప్రశ్నార్థకమైంది అని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై వైసిపి అరాచక పాలన పై కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జగన్ పాలనపై , తాజా నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం జీవోల జారీ విషయంలో ఆఫ్లైన్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వ శాఖలకు ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. 2005 వరకు ఉన్న ఏపీ సచివాలయ మ్యానువల్ రికార్డుల విధానాన్ని తిరిగి తీసుకు రావడాన్ని తిరోగమన చర్యగా పేర్కొంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువగా మారుతున్నా అవి పట్టనట్టు ఏపీ సర్కార్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ హయాంలో మొదలైన ఆన్ లైన్ జీవోల విధానాన్ని జగన్ తొలగించారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై వైసీపీ పాలనపై ధ్వజమెత్తారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications