వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘చంద్రబాబు రోగంతో రాష్ట్రానికి ప్రమాదం: మోడీ అలా చేయకుంటే పోలవరం కలగానే’

|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబునాయుడుపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు

విజయవాడ: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.

నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆ పార్టీనే న్యాయం చేసిందని అంటున్నారని దుయ్యబట్టారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు మతిభ్రమించినట్లు తెలుస్తోందని అన్నారు.

బాబు రోగంతో రాష్ట్రానికి ప్రమాదం

బాబు రోగంతో రాష్ట్రానికి ప్రమాదం

చంద్రబాబులో ఒక అపరిచితుడిని చూస్తున్నామని, ఆయనకున్న మానసిక రోగంతో రాష్ట్రానికి ప్రమాదమని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పోలవరం ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపింది బీజేపీ అని.. ఆ సంగతి మర్చిపోయి చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక వేళ ప్రధాని మోడీ ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే పోలవరం కలగానే మిగిలిపోయేదన్నారు.

పోలవరం అంచనాలు ఇష్టానుసారంగా పెంచుతూ

పోలవరం అంచనాలు ఇష్టానుసారంగా పెంచుతూ

కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పోలవరం అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచేస్తోందని కన్నా ఆరోపించారు. పోలవరానికి పెండింగ్ బిల్లు బకాయిలు లేవని పోలవరం అథారిటీ అధికారులు చెబుతున్నారని తెలిపారు. అంతేగాక, సమాచార హక్కు చట్టం ద్వారా తాము వివరాలు అడిగితే పోలవరం ప్రాజెక్టుకు పాత బకాయిలు లేవని సమాధానం వచ్చినట్లు గుర్తు చేశారు.

చంద్రబాబు అబద్ధపు ప్రచారం

చంద్రబాబు అబద్ధపు ప్రచారం

చంద్రబాబు రూ.1950 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని అబద్ధం చెబుతున్నారని కన్నా మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ రావాలనే ఉద్దేశం టీడీపీకి లేదని, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు సైందవుడిలా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం ఉక్కు పరిశ్రమ ఇస్తుందని తెలిసే టీడీపీ నాయకులు ప్రాణ త్యాగానికి సిద్ధమనే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

పోలవరం కాంగ్రెస్ భిక్షా?

పోలవరం కాంగ్రెస్ భిక్షా?

ఇది ఇలా ఉంటే, ఇందిరాసాగర్‌ పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలు విడ్డూరమని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం కాం‍గ్రెస్‌ పెట్టిన భిక్షే అని ముఖ్యమంత్రి చెప్పడం ఆయన ద్వంద వైఖరికి నిదర్శమని చెప్పారు.

ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును ప్రస్తావించకపోవడం చంద్రబాబు సంకుచిత స్వభావాన్ని తెలియజేస్తుందని ధ్వజమెత్తారు. 2007లో పోలవరానికి శంకుస్థాపన వైయస్సార్‌, కేవలం 5,135 కోట్లతో 30 శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేశారని ఐజయ్య వెల్లడించారు.
‘అవినీతి సొమ్ముతో 2019 ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు అనుకుంటున్నారు.
ఓటుకు రూ. 5 వేల చొప్పున పంపిణీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు' అని ఆరోపించారు.

English summary
Andhra Pradesh BJP president Kanna Lakshminarayana on Tuesday lashed out at AP CM Chandrababu for Polavaram project issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X