'సివిల్స్, గ్రూప్ -1 పరీక్షలలో కాపులకు ప్రత్యేక అధ్యయన కేంద్రాలు'
హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్షలు, గ్రూప్ 1 పరీక్షలలో శిక్షణ కోసం కాపులకు ప్రత్యేక అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయాలని కాపు కార్పొరేషన్ నిర్ణయించింది. కాపు యువత నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది.
కాపు కార్పొరేషన్ తొలి భేటీ శనివారం నాడు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో జరిగింది. కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామాంజనేయ, ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్, అధికారి నాగభూషణం, కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు.

ఇందులో పలు అంశాలపై చర్చించారు. మహిళలకు ప్రత్యేకంగా కుట్టుపని, అద్దకం, అప్పడాల తయారీ, పచ్చళ్ల తయారీ, అగర్‌బత్తీలు, కొవ్వొత్తుల తయారీలో శిక్షణనివ్వాలని నిర్ణయించారు. బంగారం, వెండి వస్తువుల తయారీలో మెలకువలు, ఇటుకల తయారీలో శిక్షణ ఇవ్వాలనుకున్నారు.












Click it and Unblock the Notifications