ఖచ్చితంగా రాజకీయం చేస్తాం - ముద్రగడ..!!
కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలో చేరటం అధికారికమైంది. వైసీపీ ముఖ్య నేతలు కిర్లంపూడిలో ముద్రగడను కలిసారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ముద్రగడ సమ్మతించారు. తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు. గౌరవించే వారితోనే కలిసి పని చేద్దామని ప్రకటించారు. ఎన్నికల్లో ఖచ్చితంగా రాజకీయం చేస్తామని వెల్లడించారు. తూర్పు గోదావరిలో ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరిక రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే చర్చ మొదలైంది.
ముద్రగడ పద్మనాభంతో వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్‌ఛార్జ్ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్‌ఛార్జ్ తోట నరసింహం భేటీ అయ్యారు. సుదీర్ఘ మంతనాలు జరిపారు. వైసీపీలో చేరటానికి ముద్రగడ అంగీకరించారు. ఈ నెల 10న అమావాస్య తరువాత వైసీపీలో చేరిక పైన ప్రకటన చేయనున్నారు. ముద్రగడ కుమారుడికి కీలక పదవి ఇవ్వటంతో పాటుగా ముద్రగడకు తగిన ప్రాధాన్యత ఉంటుందని పార్టీ నేతలు హామీ ఇచ్చారు.

ముద్రగడతో జరిగిన చర్చల గురించి ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. సీఎం జగన్ ఆదేశాలతో ముద్రగడను కలిశామని చెప్పారు. ముద్రగడను వైఎస్ఆర్ సీపీలోకి ఆహ్వానించామని వెల్లడించారు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఉద్యమం చేశారని గుర్తు చేసారు. ముద్రగడకు పార్టీలోకి వస్తే సుముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించారు. వైసీపీలో ముద్రగడ చేరేందుకు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు .తాను జనసేనలో చేరాలనుకున్నా.అటువైపు నుంచి స్పందన లేకపోవడంతోనే తప్పని సరి పరిస్థితుల్లో వైసీపీలో చేరాల్సి వచ్చిందని ముద్రగడ చెబుతున్నారు.
అందుబాటులో ఉన్న తన అనునచర వర్గంతో సమావేశం అయ్యారు. తమను గౌరవించే వారు ఆహ్వానించినప్పుడు వారితో కలిసి పని చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఖచ్చితంగా రాజకీయం చేస్తామని ముద్రగడ వ్యాఖ్యానించారు. దీంతో, టీడీపీ - జనసేన కూటమి గోదావరి జిల్లాల్లో భారీగా ఆశలు పెట్టుకున్న సమయంలో ముద్రగడ చేరిక వైసీపీకి ఏ మేర కలిసి వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications