జగన్‌పై పవన్ కళ్యాణ్ విమర్శలు సబబే: కాపునాడు

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన సినీ హీరో, జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు సబబేనని రాష్ట్ర కాపునాడు ప్రతినిధి పిఎల్వీ ప్రసాద రావు బుధవారం ఓ ప్రకటనలో అన్నారు. పవన్ విమర్శలను ఆయన సమర్థించారు.

కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పవన్ మద్దతు పలకడం సంతోషించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు కులస్తుంలందరినీ కలుపుకొని వెళితే ఏకచత్రాధిపత్యం కోసం ఆవిర్భవించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పురిట్లోనే సంధి కొడుతోందని ధ్వజమెత్తారు.

పవన్ కేవలం పత్రికలు, టివీలలో కనిపించడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించి ప్రజలలో చైతన్యం కలుగజేయాల్సిన అవసరం ఉందని కాపునాడు ప్రతినిధి పిఎల్వీ ప్రసాద రావు అభిప్రాయపడ్డారు.

Kapunadu support to Pawan Kalyan

కాగా, జగన్‌ను ఎన్నుకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని పవన్ కల్యాణ్ ప్రజలను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఎంత దారుణంగా ఉంటాయంటే వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పటి కన్నా దారుణంగా ఉంటాయన్నారు. వైయస్ పాలనలో ఎలాంటి పరిస్థితులున్నాయో కూడా ఆయన వివరించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో ధనవంతులు బలవంతులుగా మారారని తెలిపారు. చివరికి, తనను కూడా బలవంతంగా ఒక సినిమా చేయాలంటూ బెదిరించారని పవన్ కల్యాణ్ చెప్పారు. వైయస్ హయాంలో ధనవంతులు బలవంతులుగా మారారని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ పేరిట 'జనసేన' ఫేస్‌బుక్, ట్విటర్‌లలో ప్రకటన కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+