'చిరంజీవి వల్ల గుర్తింపు, పవన్ కళ్యాణ్ వల్ల అధికారం'
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచారం వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, అదే సమయంలో చిరంజీవి వల్ల కాపులకు రాజకీయాల్లో తగిన గుర్తింపు లభించిందని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు అభిప్రాయపడ్డారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వర శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన కాపు ప్రజాప్రతినిధుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం కాపు వర్గీయులు దూడుకు స్వభావంతో, దాడులు చేసే వారిగా సమాజంలో ముద్రపడ్డారని, దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కోస్తా జిల్లాల్లోని కాపు ఓటు బ్యాంక్ వల్లే తెలుగుదేశం ఏపీలో అధికారంలోకి వచ్చిందని రామచంద్రాపురం ఎమ్మేల్యే తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. దీనిని గుర్తించే పదవిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పదవిని కాపులకు ఇచ్చారన్నారు.
రాష్ట్ర విభజన వల్ల కాపులకు మంచే జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాతే కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. రాష్ట్రం కలిసి ఉంటే కాపులను బీసీలో చేర్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. త్వరలోనే కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ పూర్తవుతుందని ఆయన చెప్పారు.
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ ! -
ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రిలీజ్.. -
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా.. టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications