వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ అలా లాక్కెళ్లిపోయారు..! కర్నాటక ఐటీ మంత్రి షాకింగ్..!
ఏపీలోని విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ను నెలకొల్పేందుకు వీలుగా ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ డేటా సెంటర్ కోసం ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా చివరికి ఏపీ దాన్ని సొంతం చేసుకోవడంతో రాష్ట్రంలో సంబరాలు మిన్నంటాయి. మంత్రి నారా లోకేష్ చొరవతో ఇలా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ కు రప్పించినట్లు స్వయంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. మరోవైపు ఈ డేటా సెంటర్ వైజాగ్ కు రావడంపై ఇతర రాష్ట్రాల అక్కసు కనిపిస్తోందని లోకేష్ ట్వీట్ కూడా చేసారు.
ఈ నేపథ్యంలో కర్నాటక ఐటీ మంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు కూడా అయిన ప్రియాంక్ ఖర్గే స్పందించారు. వైజాగ్ ను గూగుల్ డేటా సెంటర్ ఎంచుకోవడంపై స్పందిస్తూ.. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం వాళ్లకి రూ.22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చిందని ఖర్గే తెలిపారు. రాష్ట్ర జీఎస్టీలో 100 శాతం రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారని తెలిపారు. గూగుల్ కు కేటాయించిన భూమి 25 శాతం డిస్కౌంట్‌తో ఇస్తున్నారన్నారు.

"Andhra Pradesh Govt is giving huge subsidies to Google for it's Visakhapatnam Data Centre. Like 25% land, free water and electricity. Can any state afford it?"
— TDP Digital Media (@TDPDigitalMedia) October 16, 2025
- Karnataka Minister Priyank Kharge#AndhraPradesh #GoogleComesToAP #YoungestStateHighestInvestment https://t.co/5Ms3sYbxXx pic.twitter.com/RUK5abv2Vg
నీళ్లపై టారిఫ్‌లో కూడా 25శాతం డిస్కౌంట్ ఇచ్చారని కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ట్రాన్స్‌మిషన్ 100 శాతం ఉచితంగా కల్పించనున్నారని వెల్లడించారు. ఇవన్నీ వాళ్లు చెప్పరు, గూగుల్ వచ్చింది అని మాత్రమే పత్రికల్లో రాస్తారని ఖర్గే వ్యాఖ్యానించారు. అన్ని రాయితీలు తాము ఇస్తే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని అంటారు కదా అన్నారు. బెంగళూరులో జనావాసం ఎక్కువ అవుతుందని అంటున్నారని, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తే జనావాసం ఎక్కువ అవుతుంది కదా అని వ్యాఖ్యానించారు.

They say Andhra food is spicy. Seems some of our investments are too. Some neighbours are already feeling the burn! 🌶️🔥 #AndhraRising #YoungestStateHighestInvestment
— Lokesh Nara (@naralokesh) October 16, 2025
మరోవైపు వైజాగ్ కు గూగుల్ డేటా సెంటర్ రాకపై ఇతర రాష్ట్రాల్లో అప్పుడే మంట మొదలైనట్లు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. ఆంధ్రా ఆహారం కారంగా ఉంటుందని అంటున్నారని, తమ పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయని లోకేష్ ట్వీట్ చేశారు. కొంతమంది పొరుగువారు ఇప్పటికే దాని భారాన్ని అనుభవిస్తున్నారన్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications