వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవిపై కత్తి మహేష్ అసందర్భ ట్వీట్: నెటిజన్లు విమర్శలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Kathi Mahesh Targets Chiranjeevi Over Sridevi Issue

హైదరాబాద్: సాధారణంగా అసందర్భంగా చేసే పనులు విమర్శలకు దారితీస్తాయి. తాజాగా, సినీ క్రిటిక్ కత్తి మహేష్ చేసిన ఓ అసందర్భ ట్వీట్ వల్ల ఆయన విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

శ్రీదేవి మరణంతో సీని పరిశ్రమతోపాటు దేశంలోని సినీ అభిమానులంతా విషాదంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవితో ప్రత్యేక అనుబంధం కలిగిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజివీ.. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం భారత సినీ పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్యానించారు.

చర్చనీయాంశంగా..

చర్చనీయాంశంగా..

ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వార్తల్లో నిలిచే కత్తి మహేష్.. శ్రీదేవి మృతి సందర్భంగా చిరు స్పందించడంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

శ్రీదేవి మృతిపై స్పందించారు.. కానీ..

‘శ్రీదేవి మరణంపై చిరంజీవి స్పందించారు. ముదావాహం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కూడా స్పందిస్తారని ఆశిస్తాను' అని కత్తి మహేష్ తన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

దుబాయ్ వెళ్లే ముందు శ్రీదేవికి జ్వరం, గొంతునొప్పి, అవే ఇష్టం: తమ స్నేహంపై పింకిరెడ్డిదుబాయ్ వెళ్లే ముందు శ్రీదేవికి జ్వరం, గొంతునొప్పి, అవే ఇష్టం: తమ స్నేహంపై పింకిరెడ్డి

సందర్భం తెలియదా? అంటూ..

సందర్భం తెలియదా? అంటూ..

అయితే ఈ ట్వీట్‌‌పై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘మీకు అసలు సమయం, సందర్భం అనేదొకటి ఉంటుందని తెలియదా?' అంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీ సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై పలుమార్లు ట్వీట్లు చేసి విమర్శలు, బెదిరింపులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

పబ్లిసిటీ అవసరం లేదు..

పబ్లిసిటీ అవసరం లేదు..

తాజా కత్తి మహేష్ ట్వీట్‌పై నెటిజన్లు కొందరి స్పందన ఇలావుంది.. ‘‘నిజమే గానీ అడిగే సమయం ఇది కాదని నా ఉద్దేశం..', ‘ఆయనకు మీలా పబ్లిసిటీ వ్యామోహం లేదు'‘నో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్' ‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, చుట్ట కాల్చుకోవడానికి అగ్గి అడిగాడంట నీలాంటోడే'' అంటూ విమర్శలతో విరుచుకుపడ్డారు.

కత్తికి మద్దతుగానూ..

కత్తికి మద్దతుగానూ..

అంతేగాక, మరికొందరు‘‘అన్నా నీ సలహా బాగుంది కానీ ఇప్పుడు కాదు అందరూ బాధలో ఉన్నారు' ‘ప్రత్యేక హోదా గురించి చిరంజీవి మాట్లాడుతే జనం నవ్వు తారు ఇన్నీ రోజూలు ఎమయ్యరు సారు' ‘సమస్యపై స్పందించని వ్యక్తి.. చిరంజీవి'‘అసందర్బవాఖ్యలు చేసే ఓ అర్ధమేధావీ! నీ తెలివితక్కువతనాన్ని చూసైనా నీట్వీట్లకు లైకులు కొట్టేవారు మారుతారని ఆశిస్తున్నా!'' అని పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.

English summary
Film critic Kathi Mahesh asked Tollywood Megastar and MP Chiranjeevi about Andhra Pradesh special status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X