మంచి నిర్ణయం, ఇదీ లెక్క! ఒక్క దెబ్బకు రెండు పిట్టలు: పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్

Posted By:
Subscribe to Oneindia Telugu
Pawan Kalyan Vishakhapatnam tour : Kathi Mahesh hot comments | Oneindia Telugu

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ మరోసారి రెచ్చిపోయారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ ఆయన మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే. పవన్‌పై విమర్శలు చేస్తూ క్రేజ్ సంపాదించుకోవాలని భావిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

జగన్! అది మానుకో: పవన్ దిమ్మతిరిగే షాక్, 'సీఎం' నినాదాలతో అసహనం, సంతోషం లేదని..

గతంలో పలుమార్లు ఆయన పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారు. ఆయన సినిమాలపై, ఆయన నటనపై, రాజకీయాలపై ఆయన విమర్శలు గుప్పించారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కత్తి మహేష్ స్పందించారు.

మీకు హక్కులేదు, జైలుకెళ్తా, లాఠీ దెబ్బలు తింటా, మోడీని ఏదీ అడగలేదు, నా సత్తా చూపిస్తా: ఊగిపోయిన పవన్

 చాలామంది ఎవరో తనకు తెలియదంటూ

చాలామంది ఎవరో తనకు తెలియదంటూ

ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో కత్తి మహేష్ స్పందించారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన ప్రజలకు సేవ చేసేందుకేనని చాలామంది అంటున్నారని ప్రశ్నించారు. దానికి కత్తి మహేష్ స్పందించారు. ఆ చాలామంది ఎవరో తనకు తెలియదని, పవన్ హీరోగా రూపొందుతున్న అజ్ఞాతవాసి చిత్రం ఆడియో త్వరలో ఉందని గుర్తు చేశారు.

 పవన్ విశాఖ టూర్‌పై కత్తి మహేష్ లెక్క

పవన్ విశాఖ టూర్‌పై కత్తి మహేష్ లెక్క

అలానే అజ్ఞాతవాసి చిత్రం త్వరలో విడుదల కానుందని కత్తి మహేష్ చెప్పారు. ఏక్ పంత్ దో కాజ్ అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. అటు రాజకీయంగా లాభం ఉంటుందని, ఇటు సినిమా పరంగా ప్రమోషన్ అవుతుందని లెక్క చెప్పారు.

 ఒక్క దెబ్బకు రెండు పిట్టలు తప్పు కాదు

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు తప్పు కాదు

ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడమనేది తప్పు కాదని కత్తి మహేష్ అన్నారు. అసలే టైమ్ తక్కువగా ఉందని, రెండింటికి పనికి వచ్చే పని చేస్తుంటే అంతకన్నా ఏం కావాలని వ్యాఖ్యానించారు.

 రెండు రకాలుగా ఉపయోగం

రెండు రకాలుగా ఉపయోగం

పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారని కత్తి మహేష్ అన్నారు. ఇప్పటికైనా ఆయన జనాల్లోకి వెళుతున్నారని, జనాల్లోకి వెళ్లడం ఆయనకు రెండు రకాలుగానూ ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kathi Mahesh comments on Jana Sena chief and Power Star Pawan Kalyan Vishakhapatnam tour.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి