చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెర మీదకు వచ్చిన కత్తి మహేష్‌ తండ్రి:నా కొడుకుని కాదు ఆ స్వామిని బహిష్కరించండి

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

కత్తి మహేష్ కు అండగా నిలిచిన అయన తండ్రి

చిత్తూరు:తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు తాజాగా రాముడిపై వ్యాఖ్యలతో హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ కు అతడి తండ్రి అండగా నిలిచారు.

తన కుమారుడికి మద్దతుగా ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడారు. కత్తి మహేష్‌ పై బహిష్కరణ వేటుపై స్పందించిన అతడి తండ్రి కత్తి ఓబులేసు బహిష్కరణ చేయాల్సింది తన కుమారుడిని కాదని...హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానందను దేశ బహిష్కరణ చేయాలన్నారు. రాముడి గురించి కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమన్నారు.

కత్తి మహేష్ వ్యాఖ్యలు...ఆందోళన

కత్తి మహేష్ వ్యాఖ్యలు...ఆందోళన

ఇటీవల శ్రీరాముడి నుద్దేశించి కత్తి మహేష్ వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, హిందూమతాన్ని కించపరిచేలా ఉన్నాయని హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కత్తి మహేశ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ...శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర తలపెట్టగా...దానికి పోలీసులు బ్రేక్‌ వేశారు. మరోవైపు శ్రీరాముడిపై వ్యాఖ్యల కారణంగా కత్తిపై పలు కేసులు నమోదవడంతో పాటు అతడిపై నగర బహిష్కరణ వేటు పడింది.

తెర మీదకు...కత్తి మహేష్ తండ్రి

తెర మీదకు...కత్తి మహేష్ తండ్రి

కత్తి మహేష్ పై బహిష్కరణ నేపథ్యంలో ఆయన తండ్రి కత్తి ఓబులేసును మీడియా వర్గాలు స్పందన కోరగా ఆయన తన కుమారుడికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ పరిపూర్ణానందస్వామిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నా కొడుకును కాదు...హిందువులను రెచ్చగొడుతున్న ఆ పరిపూర్ణానందను దేశ బహిష్కరణ చేయాలన్నారు.తన కుమారుడు రీజన్ లేకుండా మాట్లాడడని...తను మాట్లాడాడంటే ఆధారం ఉండే ఉంటుందన్నారు. అవేమిటో అడిగితే చూపిస్తారన్నారు.

దళితుడు...కాబట్టే

దళితుడు...కాబట్టే

తన కుమారుడు ఏ ఆధారాలు లేకుండా మాట్లాడితే అప్పుడు జైల్లో పెట్టొచ్చన్నారు. మహేష్ దళితుడు కాబట్టే బ్రాహ్మణులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కత్తి ఓబులేసు మండిపడ్డారు. రాముడి గురించి నా కొడుకు మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమేనని ఆయన తేల్చిచెప్పారు. రామాయణం విష వృక్ష పుస్తకం...పూర్తిగా చదివితే రాముడు ఎలాంటి వాడో అందరికీ అర్థమవుతోందని అన్నారు.

నా కొడుకు హిందువే...ఆస్తికుడు

నా కొడుకు హిందువే...ఆస్తికుడు

నా కొడుకు హిందువే...నాస్తికుడు కాదు...అస్తికుడేనని తెలిపారు. తన కుమారుడి వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. నా కొడుకు తన భార్యతో కలిసే ఉన్నాడు విడిపోలేదని చెప్పారు. ఈ నెల 4న లక్నో వెళ్లి కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారని తెలిపారు. సామాజిక మాథ్యమాల్లో కావాలనే కొంతమంది నా కొడుకుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు.

English summary
Chittoor: The father of film critic Kathi Mahesh father supported his son , who has been expulsion from the Hyderabad city with frequent controversial remarks and recent comments on Lord Rama. He spoke to media for the first time to support his son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X