కవిత: అప్పుడు బతుకమ్మ, ఇప్పుడిక బాక్సింగ్

శుక్రవారం జరిగిన ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత తెలంగాణ బాక్సింగ్ సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎం. ధనుంజయ్ గౌడ్ వ్యవహరిస్తారు. తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు బతుకమ్మను ఉద్యమానికి జోడించిన కవిత ఇప్పుడు బాక్సింగ్‌కు ప్రోత్సాహం లభించేలా చూస్తారని బావిస్తున్నారు.
తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను ఉద్యమ స్థాయిలో నిర్వహించి, తెలంగాణ ఉద్యమానికి కవిత సహకరించారు. హైదరాబాదులో బతుకమ్మ పండుగ ఆడడాన్ని వాస్తవం చేసిన ఘనత ఆమెకే దక్కుతుంది. బతుకమ్మ పండుగ కనుమరగై పోతూ, తెలంగాణ పల్లెల్లో అక్కడ మాత్రమే ఉంటూ వచ్చింది.
కవిత బహిరంగ ప్రదేశాల్లో బతుకమ్మలు ఆడడాన్ని ప్రోత్సహించారు. పూర్ణకుంభాలతో స్వాగతాలు పలకడానికి బదులు బతుకమ్మలతో స్వాగతం పలకడాన్ని కవిత తెలంగాణలో అలవాటు చేశారు. తద్వారా తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఊపునిచ్చారు.












Click it and Unblock the Notifications