వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ... ఇక్కడా పోరాడి విడిపోయాం!: కవిత (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ స్కౌంట్స్ అండ్ గైడ్స్ యూనిట్‌కు తిరిగి పూర్వ వైభవం తీసుకు వస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం చెప్పారు.

హైదరాబాదులోని ఏవీ కాలేజీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆమె రాష్ట్ర స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి భారత స్కౌంట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ సుకుమార్, రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులు హాజరయ్యారు.

 కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ఎంతో పోరాడి తెలంగాణ స్కౌంట్స్ అండ్ గైడ్స్ శాఖను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత

ఏపీ స్కౌంట్స్ అండ్ గైడ్స్ నుండి విడిపోయి నేటి నుడి తెలంగాణకు ప్రత్యేకంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పడిందన్నారు.

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత


ఇందుకు సహకరించిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు కవిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరం కష్టపడి దేశంలోనే బెస్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్‌గా తీర్చిదిద్దుతామన్నారు.

 కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత

1986లో స్కౌంట్స్ అండ్ గైడ్స్‌కు శాంతి పురస్కారం లభించిందని చెప్పారు. గతంలో ఎక్కడ చూసినా ప్రేమభావంతో, సేవాభావంతో, అంకితభావంతో పని చేసే స్కౌంట్స్ అండ్ గైడ్స్‌ కనిపించే వారని, ఇప్పుడు అది తగ్గిపోయిందన్నారు.

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత

ఇప్పుడు దీనిపైన శ్రద్ధ తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వం సహకారం లేకపోవడం మరే ఇతర కారణాలు అయినా కావొచ్చని చెప్పారు. ఇక పైన సేవాభావంతో పని చేసి స్కౌంట్స్ అండ్ గైడ్స్‌‌ను అభివృద్ధి చేసుకుందామన్నారు.

English summary
Kavitha takes as chairman of Bharath Scouts and Guides president
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X