ఒరిగేదేం లేదు, అణగదొక్కేందుకే: పవన్ కళ్యాణ్‌పై కవిత

కాగా, మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రంలో హల్‌చల్ చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వీరు ముగ్గురు ఒకే వేదికపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో మోదీ, చంద్రబాబు, పవన్ కలిసి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 24, 26న తెలంగాణలో ప్రచారానికి, అలాగే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభలో వీరు పాల్గొనేలా టిడిపి, బిజెపి వర్గాలు ఏర్పాటు చేస్తున్నాయి.
మే 1 నుంచి సీమాంధ్రలో మోదీ, చంద్రబాబు, పవన్ కలిసి పర్యటించనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ, అనంతపురం, తిరుపతి, నర్సాపురం, విశాఖలో బహిరంగ సభలకు సన్నాహాలు జరుగుతున్నాయి. బిజెపి తరపున ప్రచారం నిమిత్తం కర్నాటకు వెళ్లిన పవన్ తిరిగి వచ్చిన తర్వాత ఇరు ప్రాంతాల్లో పర్యటనపై షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కెసిఆర్, బాబు మోసం: గుత్తా
తెలంగాణను మోసం చేసింది తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడులేనని గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. ఎన్నికల్లో కెసిఆర్ సీట్లు అమ్ముకున్నాడన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన ఉద్యమ ద్రోహులకు కెసిఆర్ టికెట్లిచ్చాడని ఆయన ఆరోపించారు.
తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో తెరాసను విలీనం చేస్తామని కెసిఆర్ మాటిచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టబడి కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, ఒప్పందానికి తూట్లు పొడిచి కెసిఆర్ ఎన్నికల్లో పోటీ పడుతున్నారన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంస్థను సరిగా నడపని కెసిఆర్ తెలంగాణను ఎలా పునర్నిర్మిస్తారన్నారు.












Click it and Unblock the Notifications