ఆలస్యమైంది, ఏ పార్టీనో.. కాంగ్రెస్ నుండి నో: కావూరి

అయితే, సీమాంధ్ర ప్రాంతానికి ఇంకా ఏదైనా సాధించాలనే తపనతో రాజీనామా ఆలస్యమైందని చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం చాలా తప్పని అధఇష్టానానికి చాలాసార్లు చెప్పానని తెలిపారు. కేంద్రమంత్రివర్గంలో, లోకసభలో విభజనకు వ్యతిరేకంగా పోరాడామన్నారు. అయినా కాంగ్రెసు పార్టీ పట్టించుకోలేదని చెప్పారు. విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్రకు న్యాయం కోసం ఇన్నాళ్లు ప్రయత్నాలు చేశానన్నారు.
ఆంధ్రా ప్రాంతానికి మరింత సాదిద్దామనే ఉద్దేశ్యంతోనే రాజీనామాకు ఆలస్యమైందన్నారు. తొమ్మిది కోట్ల జనాభా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ పైన ఎలాంటి చర్చ లేకుండా విభజన చేస్తారా అని ప్రశ్నించారు. మంత్రుల డిమాండ్లను అధిష్టానం పట్టించుకోలేదన్నారు. విభజన తీరు ఏమాత్రం బాగా లేదన్నారు.
కాంగ్రెసులో ఉంటానో లేదో నిర్ణయించుకోలేదు
తాను కాంగ్రెసు పార్టీలో ఉండాలో లేదో నిర్ణయించుకోలేదని కావూరి చెప్పారు. అయితే, లోకసభకు తాను కాంగ్రెసు పార్టీ నుండి పోటీ చేయనని చెప్పారు. బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్‌తో తాను భేటీ అయింది వాస్తవమే అన్నారు. అయితే, రాజకీయ కారణాలు లేవన్నారు. తాను ఏ పార్టీలో ఉండాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications