రాహుల్‌లకు కావూరి ఝలక్! గుర్తు తెచ్చుకోండి: షర్మిల

Kavuri no to Rahul Gandhi
హైదరాబాద్/నెల్లూరు: కేంద్ర జౌళీశాఖ మంత్రి కావూరి సాంబశివ రావు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌లకు షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. కావూరి కూడా అదే బాటలో నడవనున్నారు.

ఈ విషయం తెలిసిన రాహుల్ గాంధీ... పార్టీని వీడవద్దని కావూరిని కోరారు. దానికి ఆయన నో చెప్పారు. దిగ్విజయ్ సింగ్ కూడా పార్టీని వీడవద్దని సూచించారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ కనిపించడం లేదని, పార్టీని వీడటం మినహా మరోదారి కనిపించడం లేదని డిగ్గీకి కావూరి చెప్పారట. అయితే, ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనేది ఇంకా స్పష్టత రాలేదు.

వైయస్‌ను గుర్తు తెచ్చుకోండి: షర్మిల

ఓటు వేసే ముందు ప్రజలు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని గుర్తుకు తెచ్చుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. రైతులకు మేలు చేసేందుకు వైయస్ నిరంతరం శ్రమించేవారన్నారు. రాష్ట్రాన్ని వైయస్ కన్న తండ్రిలా పాలించారని, జగన్‌తో మళ్లీ ఆయన సుపరిపాలన వస్తుందన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటివి ఎన్నో పథకాలను తీసుకొచ్చారన్నారు. గొప్పలు చెప్పుకోవడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఎవరూ సాటిరారన్నారు. అధికారం కోసం ఆయన సంక్షేమ పథకాలని కొత్త పల్లవి అందుకున్నారన్నారు. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటు వేసేముందు వైయస్‌ను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.

సీమాంధ్ర కాంగ్రెసు బస్సుయాత్ర సమన్వయకర్త సుధాకర్

సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ బస్సు యాత్రకు సుధాకర్ బాబును సమన్వయకర్తగా నియమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+