అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

APపై KCRకు 'వ్యూహాత్మక ప్రేమ'!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్ విషయంలో అయ్యో పాపం అంటుంటారు. జాలి చూపిస్తుంటారు. మరోవైపు మంత్రులు మాత్రం ఏపీ ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో నిప్పులు కురిపిస్తున్నారు. ఏదైనా ఒక అంశం ప్రజల్లోకి వస్తే వాటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు? దానివెనక ఏమైనా కారణాలున్నాయా? స్వప్రయోజనాలేమైనా ఇమిడివున్నాయా? అంటూ విశ్లేషణ చేసుకుంటున్నారు.

 మరో ఐదేళ్లైనా పోలవరం పూర్తికాదు!

మరో ఐదేళ్లైనా పోలవరం పూర్తికాదు!

మంత్రి హరీష్ రావు నిత్యం ఏపీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకన్నా వెనక కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించామని, శరవేగంగా పూర్తిచేసి దాని ఫలాలను రైతులకు అందిస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తామని చెబుతున్న తరుణంలో అకస్మాత్తుగా హరీష్ రావు విమర్శలు చేశారు. మరో 5 సంవత్సరాల సమయం గడిచినా పోలవరం పూర్తికాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

 కేంద్రానికి వణుకుతున్న ఏపీ?

కేంద్రానికి వణుకుతున్న ఏపీ?


మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ అయితే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి గజగజ వణుకుతోందని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రయివేటు పరం చేయడానికి ప్రయత్నిస్తోందని.. అయినప్పటికీ ప్రభుత్వానికి ప్రశ్నించే దమ్ము లేదన్నారు. కానీ తెలంగాణలోని సింగరేణి విషయంలో మాత్రం కేంద్రం తోక ముడిచిందని, దీనికి కారణం తమకు బలమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని అన్నారు. ఈశ్వర్ వ్యాఖ్యలపై ఏపీలో రాజకీయ రగడ జరిగింది.

 దాగివున్న రాజకీయ వ్యూహం

దాగివున్న రాజకీయ వ్యూహం


ఇటీవలే జరిగిన టీఆర్ఎస్ విస్త్రతస్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ తమ పార్టీ నేతలను లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నం చేసిందని చెప్పిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఏపీలో కూడా కుట్రలు చేస్తోందన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కేంద్రం చేస్తున్న కుట్రలను అందరూ తిప్పికొట్టాలన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి ఏపీ కూడా ఆయనతో కలిసిరావాలనే అర్థమొచ్చినట్లుగా మాట్లాడారని, ఒకవైపు మంత్రులు ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండగా, మరోవైపు కేసీఆర్ కలిసి రమ్మనమనడంలో రాజకీయ వ్యూహం దాగివుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత రాష్ట్ర సమితికి మద్దతుగా వైసీపీ ఉండాలనేదే కేసీఆర్ కోరిక అని, కానీ ఇక్కడి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

English summary
Telangana Chief Minister Kalvakuntla Chandrasekhar Rao says it is a pity about Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X