ఏపీలో ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు

Subscribe to Oneindia Telugu

గుంటూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను గుంటూరు జిల్లా తెనాలిలో ఘనంగా నిర్వహించారు. కేసీఆర్‌ అభిమాన సంఘం నేత ఖాదీర్‌ ఆధ్వర్యంలో తెనాలి చెంచుపేటలోని శబరి వృద్ధాశ్రమంలో కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచుకున్నారు.

హ్యాపీ బర్త్‌ డే: కేసీఆర్‌కు మోడీ ఫోన్, ఏం చెప్పారంటే..?, ఫొటోతో కేటీఆర్ ఇలా..

అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతోందని, ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ అభిమాన సంఘం నేత షేక్ ఖదీర్ ఈ సందర్భంగా చెప్పారు.

KCR birth day celebrations in Andhra Pradesh

కేసీఆర్ 63వ పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం(ఫిబ్రవరి 17న) తెలంగాణతోపాటు విదేశాల్లో కూడా ఘనంగా జరుపుకున్నాయి టిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM K Chandrasekhar Rao birth day celebrations held Tenali in Andhra Pradesh state.
Please Wait while comments are loading...