ఢిల్లీలో కెసిఆర్ ఫోటో తొలగింపు, నిలదీయడంతో చంద్రబాబు ఫోటో కూడా

ఢిల్లీ: ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్/తెలంగాణ భవన్‌లోని గురజాడ హాలులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావుల చిత్రపటాలు గోడల పైనుంచి తీసేశారు. గురజాడ హాలులో సోమవారం ఏజేఏడీ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఉమ్మడిగా కొనసాగుతున్న గురజాడ సమావేశ మందిరంలో ఏపీ సీఎం చంద్రబాబు ఓ కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా తొలుత కేసీఆర్ చిత్రపటాన్ని తొలగించడం వివాదానికి దారి తీసింది.

రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల చిత్రపటాలను ఈ సమావేశ మందిరం అధికారులు పెట్టారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఈ సమావేశ మందిరంలో ఏపీ జర్నలిస్టు అసోసియేషన్ (ఢిల్లీ శాఖ)ను లాంఛనంగా ప్రారంభించడానికి ఆ రాష్ర్టానికి చెందిన పాత్రికేయులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

KCR, Chandrababu photos removed from AP/Telangana Bhavan

దీన్ని చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలన్న ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి చంద్రబాబు రావడానికి కొన్ని నిమిషాల ముందు చంద్రబాబు ఫొటోను అదే స్థానంలో ఉంచి, కేసీఆర్ ఫొటోను మాత్రం తొలగించారు.

దీన్ని గమనించిన తెలంగాణ జర్నలిస్ట్ ఒకరు వెంటనే తెలంగాణ భవన్ అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్ రావుకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసిన రామ్మోహన్ రావు వెంటనే గురజాడ సమావేశ మందిరానికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిబ్బందిని నిలదీశారు.

కెసిఆర్ ఫోటో తొలగింపుపై అడిగారు. వెంటనే ఆ ఫొటోను యథాస్థానంలో పెట్టాలని సూచించారు. ఉంటే రెండు ఫొటోలు ఉండాలి. లేకుంటే ఇద్దరివీ ఉండకూడదని, కేవలం చంద్రబాబుది మాత్రమే పెట్టి కేసీఆర్ ఫొటో లేకుండా చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు అని రామ్మోహన రావు స్పష్టం చేశారు.

దీంతో అక్కడే ఉన్న ఆంధ్ర సిబ్బంది చంద్రబాబు ఫొటోను కూడా తొలగించారు. ప్రస్తుతం రెండు ఫొటోలూ లేవు. వాటిని భవన్‌లో పని చేస్తున్న ఆంధ్ర ప్రభుత్వానికి చెందిన ఒక కిందిస్థాయి సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు దృష్టిలో పడడం కోసం కేసీఆర్ ఫొటోను తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అనంతరం చంద్రబాబు మీడియా సమావేశం పూర్తయ్యాక కూడా ఇద్దరు సీఎంల ఫోటోలు గోడలకు ఎక్కలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+