ఏపీకి అన్యాయం: వెంకయ్య, కేంద్రాన్ని..: కేసీఆర్, గ్రేటర్‌పై
హైదరాబాద్: విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే సామరస్యంగా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. రాజకీయ రంగులను పులుముకోకుండా కేంద్ర నిధులను ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
పట్టణాభివృద్ధి కోసం లోకల్ అథారిటీలు సక్రమంగా పని చేయాలన్నారు. పార్లమెంటులో ఇన్సురెన్స్ యాక్ట్ సవరణ బిల్లును త్వరలో ప్రవేశ పెట్టనున్నట్లు చెప్పారు. బీమా రంగంలో 49% ఎఫ్‌డీఐలకు అనుమతిస్తామని, ప్రతిపక్షాలు కూడా బీమా బిల్లుకు సహకరించాలన్నారు.
కేంద్రాన్ని నిలదీయాలి: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో పార్టీ సీనియర్ నేత కేకే నివాసంలో తెరాస భేటీ అయింది. ఈ భేటీలో కేసీఆర్ నాయకులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు, రైతు సమస్యలు.. తదితర అంశాల పైన కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల పైన నేతలు అందరు దృష్టి సారించాలన్నారు. గ్రేటర్‌లోని మంత్రులు దీని పైన మరింత ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. హైదరాబాదులో పార్టీ నిర్మాణం, కొత్తగా వచ్చే వారిని చేర్చుకోవడం వంటి వాటి పైన దృష్టి సారించాలన్నారు. తద్వారా గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు.












Click it and Unblock the Notifications