తెలంగాణ వచ్చినా ఓయు మారలేదు! ఎందుకో కేసీఆర్ చెప్పాలి (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, సండ్ర వెంకట వీరయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేసీఆర్ ఏడాది పాలన అప్రజాస్వామికం, అవినీతి అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారెవరూ ఇప్పుడు సంతోషంగా లేరని చెప్పారు. మానుకోట బాధితులను ఆదుకోలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌తో కలిసి పని చేశారన్నారు.
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కనీసం మంత్రిని కూడా చేయలేదన్నారు. తెలంగాణ వచ్చినప్పటికీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేడు ఉత్సవాలు ఎందుకు జరగడం లేదో కేసీఆర్ చెప్పాలన్నారు. ఆర్ కృష్ణయ్య నిజాయితీగా పార్టీ అభ్యర్థికి ఓటు వేశారని చెప్పారు.

కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఓయూ భూములను తీసుకుంటానన్న వ్యాఖ్యలపై విద్యార్థి లోకం భగ్గుమంటున్న విషయం తెలిసిందే.

ఓయులో నిరసన ర్యాలీ
అదేవిధంగా తాజాగా ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యంతో సర్కార్ పైన విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓయులో నిరసన ర్యాలీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

ఓయులో నిరసన
దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. తమను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.

సంబరాలు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ వైపు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి సంఘం రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించింది.

నిరసన
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ వైపు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి సంఘం రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించింది. మరోవైపు, నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన.

నిరసన
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ వైపు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి సంఘం రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించింది. మరోవైపు, విద్యార్థుల నిరసన.












Click it and Unblock the Notifications