విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేసీఆర్ ప్రభుత్వ బిడ్: ఏపీమంత్రి గుడివాడ అమర్నాథ్ లాజిక్!!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని చాలా కాలంగా విశాఖ ఉక్కు ఉద్యమం కూడా కొనసాగుతోంది. అయినప్పటికీ కేంద్రం ప్రైవేటీకరణకు వేగంగానే అడుగులు వేస్తుంది.
ఇక ఈ క్రమంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూనే, తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు బిడ్ వెయ్యాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. బిడ్డింగ్ ప్రక్రియను అధ్యయనం చేయాలంటూ అధికారులను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం . ఇక ఈ క్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బిఆర్ఎస్ విధానంపై తనదైన శైలిలో స్పందించారు. లాజికల్ గా మాట్లాడారు.
విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించకూడదని ఏపీ ప్రభుత్వం భావిస్తుందని, ప్రైవేటీకరణ చేయకూడదు అనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ ప్రక్రియకు సిద్ధమైతే, తాము బిడ్డింగ్ లో ఎలా పాల్గొంటామని, అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకూడదు అన్నదే తమ విధానం అన్నారు. తమ స్టాండ్ అదైనప్పుడు ప్లాంట్ ను తాము ఎలా కొంటామంటూ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.

గతంలో కేసీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం కరెక్ట్ కాదని చెప్పారని, ఇప్పుడు తాము కూడా బిడ్ వేస్తామని వారు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. కెసిఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం బిడ్డింగ్ వేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయమనేది వారి ఉద్దేశం అన్నట్టుగా కనిపిస్తుందన్నారు. అయితే ఈ అంశం గురించి కేసీఆర్ నుండి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదన్నారు.
వారు దీనిపై వ్యాఖ్యానించింది తాము వినలేదని, అధికారికంగా వాళ్ళ స్టాండ్ ఏమిటో తెలియకుండా ఈ అంశంపై తాను మాట్లాడలేనని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్ అని పేర్కొన్న ఆయన రాజకీయాల కోసం ఎవరో ఏదో మాట్లాడారని, వాటికి తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications