హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పెషల్ ఇంక్రిమెంట్: వోల్వో సర్వీస్‌ ప్రారంభించిన కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసి కార్మికులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇంక్రిమెంట్లు ఈ రోజు నుంచే అమలులోకి వస్తుందని చెప్పారు. నగరంలోని పీపుల్స్ ప్లాజ్ వద్ద వోల్వో బస్సు సర్వీస్‌ను సిఎం కెసిఆర్ శనివారం ప్రారంభించారు. తొలి విడతగా 80 ఏసీ వోల్వో బస్సులు నగర రోడ్లపై తిరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సేవలను కొనియాడారు.

సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. దసరా, బతుకమ్మ పండగలను సైతం లెక్క చేయకుండా ప్రజలు కూడా సమ్మెకు సహకరించారని తెలిపారు. ఈ సందర్భంగా కెసిఆర్ ఆర్టీసీ కార్మికులకు అభినందనలు తెలిపారు. సుమారు 57వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని చెప్పారు.

సకల జనుల సమ్మెను పురస్కరించుకుని ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక ఇంక్రిమెంటు ప్రకటిస్తున్నట్లు కెసిఆర్ చెప్పారు. ఈ రోజు నుంచే ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ ఇంక్రిమెంట్ల వల్ల ఆర్టీసీపై 18 నుంచి 20 కోట్ల భారం పడుతుందని, అయిత ఈ సొమ్మును ప్రభుత్వమే భరిస్తుందని కెసిఆర్ తెలిపారు. సర్వే నిర్వహించిన రోజు ఆర్టీసికి సెలవు ఇవ్వనందున, ఆ రోజును సెలవు దినంగా వాడుకోవచ్చని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ ఆర్టీసి కార్మికులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

ఇంక్రిమెంట్లు ఈ రోజు నుంచే అమలులోకి వస్తుందని చెప్పారు. నగరంలోని పీపుల్స్ ప్లాజ్ వద్ద వోల్వో బస్సు సర్వీస్‌ను సిఎం కెసిఆర్ శనివారం ప్రారంభించారు.

కెసిఆర్

కెసిఆర్

తొలి విడతగా 80 ఏసీ వోల్వో బస్సులు నగర రోడ్లపై తిరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సేవలను కొనియాడారు.

కెసిఆర్

కెసిఆర్

సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. దసరా, బతుకమ్మ పండగలను సైతం లెక్క చేయకుండా ప్రజలు కూడా సమ్మెకు సహకరించారని తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ సందర్భంగా కెసిఆర్ ఆర్టీసీ కార్మికులకు అభినందనలు తెలిపారు. సుమారు 57వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

సకల జనుల సమ్మెను పురస్కరించుకుని ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక ఇంక్రిమెంటు ప్రకటిస్తున్నట్లు కెసిఆర్ చెప్పారు. ఈ రోజు నుంచే ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ ఇంక్రిమెంట్ల వల్ల ఆర్టీసీపై 18 నుంచి 20 కోట్ల భారం పడుతుందని, అయిత ఈ సొమ్మును ప్రభుత్వమే భరిస్తుందని కెసిఆర్ తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

సర్వే నిర్వహించిన రోజు ఆర్టీసికి సెలవు ఇవ్వనందున, ఆ రోజును సెలవు దినంగా వాడుకోవచ్చని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ ఆర్టీసి సుమారు 90లక్ష్ల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తుందని కెసిఆర్ చెప్పారు.

తెలంగాణ ఆర్టీసి సుమారు 90లక్ష్ల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తుందని కెసిఆర్ చెప్పారు. తాను ఏపి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 11 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని 12 కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చానని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని అన్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు, యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

25వేల కి.మీ రోడ్లకు మెరుగులు దిద్దుతామని, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు 10వేల కి.మీ కొత్త రోడ్లు వేస్తామని చెప్పారు. దేశంలో రోడ్లు బాగున్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని చెప్పారు. రూ. 600 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో 20వేల కి.మీ రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించాలంటే.. సొంత వాహనాలను కాకుండా ఆర్టీసీనే ప్రజలు ఉపయోగించాలని కోరారు.

ఆర్టీసీ ప్రయాణం భద్రమైనదని చెప్పారు. ఆర్టీసీలో మహిళా సిబ్బందికి ప్రత్యేక లంచ్ రూం, టాయ్ లెట్స్, సదుపాయులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సిఎం అయిన తర్వాత కెసిఆర్ దొరుకుతలేడనే ఉద్దేశంతో మంత్రి మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించారని చెప్పారు. మహేందర్ రెడ్డి తెలివైనవాడని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, నగర మేయర్ మాజీద్ హుస్సేన్, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Saturday launches volvo buses in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X