అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ - చంద్రబాబు కు అడ్డు ఎవరు : సౌత్ కేంద్రంగా కొత్త సమీకరణాలు : ఇద్దరూ డిసైడ్ అయ్యారా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

వైఎస్ జగన్. ఏపీ సీఎం. లోక్ సభలో ఎక్కవ మంది సభ్యులున్న నాలుగో పార్టీ అధినేత. చంద్రబాబు..నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం. జాతీయ రాజకీయాల సమన్వయం చేయగల నేర్పరి. కానీ, ఇప్పుడు జాతీయ రాజకీయాల అంశంలో మౌనంగా ఉంటున్నారు. యాక్టివ్ రోల్ పోషిస్తున్న పార్టీలు వీరిద్దరిని కలుపుకొనే ప్రయత్నాలు చేయటం లేదా..వారు ఆహ్వానించినా..వీరు సిద్దంగా లేరా. అయిదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఇప్పుడు జాతీయ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాని మోదీ లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు తొలి నుంచి ప్రధాని పైన గుర్రుగా ఉన్న మమతా - స్టాలిన్ లు సైతం కేంద్రం పైన పోరాటం విషయంలో ఒక్కటవుతున్నారు.

జగన్ - చంద్రబాబు మౌనంగానే..

జగన్ - చంద్రబాబు మౌనంగానే..

వారిద్దరూ ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి థాక్రేతో పాటుగా కేసీఆర్ తోనూ కలిసి ముందుకు సాగాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా... తాజాగా కేసీఆర్ - స్టాలిన్ కు మమతా ఫోన్ చేసారు. ఎన్డీఏ - కాంగ్రేతర పార్టీల సీఎంల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, వీరి తరహాలోనే ఏపీ సీఎం జగన్ సైతం అటు బీజేపీ..ఇటు కాంగ్రెస్ తో రాజకీయంగా ఎటువంటి సంబధాలు లేవు. ప్రాంతీయ పార్టీగా అధికారంలో ఉన్నారు. మరి..ఈ పార్టీలు..అందునా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు జగన్ ను తమతో కలుపుకొనే ప్రయత్నం చేసారా..చేసినా..జగన్ తిరస్కరించారా. ఇక, ఇది ముఖ్యమంత్రుల సమావేశం కావటంతో చంద్రబాబుకు ఆహ్వానం లేదు. కానీ, జాతీయ స్థాయిలో ఆయన 2019 ఎన్నికలకు ముందు ఇప్పుడు ఈ పార్టీలు ఏ అజెండాతో ఏకం అవుతున్నాయో...అదే అజెండాతో అందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చే ప్రయత్నం చేసారు. మోదీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబు నాడు కోరుకున్నదే నేడు

చంద్రబాబు నాడు కోరుకున్నదే నేడు

మోదీ అధికారం నుంచి దిగిపోవటం ఖాయమని ప్రచారం చేసారు. కానీ, 2019 ఎన్నికల్లో కేంద్రంలో మోదీ తిరిగి అధికారం దక్కించుకోగా... ఏపీలో తాను అధికారం కోల్పోయారు. అప్పటి నుంచి చంద్రబాబు అటు కేంద్రం..ప్రధాని పైన ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం లేదు. 2019 ఎన్నికల సమయంలో నేరుగా రాహుల్ నివాసానికి వెళ్లి.. హైదరాబాద్ లో రాహుల్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు..ఇప్పుడు కాంగ్రెస్ తోనూ దూరం ఉంటున్నారు. చంద్రబాబుకు అటు మమతా.. ఇటు డీఎంకేతోనూ సన్నిహిత సంబంధాలు గతంలో ఉండేవి. ఇక, ఇదే విధంగా జగన్ కు సైతం వీరితో మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ, ఇప్పుడు కేసీఆర్ కలక భూమిక పోషిక పోషిస్తుండటంతో చంద్రబాబుకు ఈ కూటమిలో భవిష్యత్ లోనూ అవకాశం దక్కుతుందా లేదా అనేది అనుమానమే. ఇక, ఏపీ లో ప్రస్తుతం నెలకొన్ని ఆర్దిక కష్టాలు..పాలనా పరమైన వ్యవహారాలతో కేంద్రంతో సీఎం జగన్ కు సత్సంబంధాలు అసవరం.

సీఎం జగన్ మాత్రం దూరంగానే..

సీఎం జగన్ మాత్రం దూరంగానే..

అందునా..ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో అధికారంలో ఉంటూ..హామీలు పూర్తి చేయాల్సిన బాధ్యత జగన్ పైన ఉంది. దీంతో...ఈ కొత్త కూటమి నేతల నుంచి ఆహ్వానం వచ్చినా..ఇప్పటికిప్పుడు ఏపీ సీఎం కేంద్రానికి వ్యతిరేకంగా వారితో కలిసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. వీటిని జాగ్రత్తగా గమనిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు... సీఎం జగన్ తీసుకొనే నిర్ణయాలకు అనుగుణంగా తాను స్టెప్ వేయాలని..అప్పటి వరకు వేచి చూసే ధోరణితో ఉన్నట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల ముందు టీడీపీని బీజేపి తో దూరం చేయటంతో జగన్ ట్రాప్ లో నాడు చంద్రబాబు చిక్కుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు సైతం జగన్ కు కేంద్ర పెద్దలతో దూరం పెరిగితే..ఆ స్థానం భర్తి చేసేందుకు సిద్దంగా ఉన్నారు. దీని కారణంగానే.. జాతీయ స్థాయిలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నా... మౌనంగానే ఉంటున్నారు.

రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలే కీలకంగా

రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలే కీలకంగా

ఎక్కడా తన అభిప్రాయాలను వెల్లడించటం లేదు. ఇప్పుడు సీఎం జగన్.. చంద్రబాబు ఇద్దరి లక్ష్యం 2024 లో అధికారం నిలుపుకోవటం - దక్కించుకోవటం. కేంద్రం తీరు పైన వైసీపీ కొన్ని సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా... మరి కొంత కాలం వేచి చూసే ధోరణితో ఉంది. అదే సమయంలో మమతా-కేసీఆర్-స్టాలిన్ నిర్వహించాలని నిర్ణయించిన సమావేశాలు..తెర మీదకు తెస్తున్న కొత్త సమీకరణాల్లో సీఎం జగన్ - చంద్రబాబు ఇద్దరూ కలిసేది లేదు. వీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే కూటమిలో ఉండే ఛాన్స్ లేదు. దీంతో..వీరిద్దరిలో ఒకరే ఈ కూటమితో కలిసే అవకాశం ఉంది. ఇద్దరూ ప్రస్తుతం బీజేపీతోనే సఖ్యత కోరుకుంటున్న సమయంలో..భవిష్యత్ లో మాత్రం సీఎం జగన్ - చంద్రబాబు లో ఎవరి ఎవరితో కలుస్తారనేది మాత్రం ఆసక్తి కర అంశంగా మారనుంది.

English summary
An alliance is soon expected at the national level against NDA with KCR and Mamata banerjee leading the way.This is expected without Jagan and Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X