కెసిఆర్! సింహంతో వేట.. రాష్ట్రంతో ఆట వద్దు: (పిక్చర్స్)

హైదరాబాద్: సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం రెండు నెలలు దాటినా కొనసాగుతోంది. ఆయా జిల్లాల్లో రాజకీయ నాయకుల ఇళ్లను సమైక్యవాదులు ముట్టడిస్తున్నారు. నాయకులు బయటకు వచ్చినప్పుడు అడ్డుకుంటున్నారు.

మరోవైపు హైదరాబాదులోని సకల జనుల భేరీ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. కెసిఆర్ చిత్రాన్ని చెప్పులతో కొట్టి, పినాయిల్‌తో కడిగి నిరసన తెలిపారు. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే, ఆంధ్రులంతా ద్రోహులే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్రలో నిరసనలు వ్యక్తమయ్యారు.

కెసిఆర్, కోదండరామ్ వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతిలో వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. వారి బొమ్మలతో పోస్టర్లు రూపొందించి నిరసన వ్యక్తం చేశారు. కాగా, కెసిఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం కూడా నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

సమైక్య సమ్మేళనం

సమైక్య సమ్మేళనం

సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర కవి సమ్మేళనం కార్యక్రమంలో మాట్లాడుతున్న ఓ వక్త.

సమైక్య గీతాలాపన

సమైక్య గీతాలాపన

సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగు తల్లికి సమైక్యాంధ్ర గీతాలు సమర్పణ పేరుతో పద్మావతి మహిళా కళాశాలలో జరుగుతున్న కార్యక్రమంలో పాటలు పాడుతున్న దృశ్యం.

ఆసనాలతో

ఆసనాలతో

సమైక్యాంధ్ర ఉద్యమంలో ఐకాస ఆధ్వర్యంలో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆసనాలు వేస్తూ నిరసన తెలుపుతున్న పాఠశాల విద్యార్థులు.

కెసిఆర్

కెసిఆర్

కుక్క కాటుకి చెప్పుదెబ్బ, సీమాంధ్ర దోహి సంస్కారహీనుడు చంబార్‌కే దేవుకు చప్పల్ కా పూజా అంటూ కెసిఆర్ చిత్రంతో నిరసనల దృశ్యం.

చెప్పులతో

చెప్పులతో

కుక్క కాటుకి చెప్పుదెబ్బ, సీమాంధ్ర దోహి సంస్కారహీనుడు చంబార్‌కే దేవుకు చప్పల్ కా పూజా అంటూ కెసిఆర్ చిత్రాన్ని చెప్పులతో కొడుతున్న దృశ్యం.

కోదండరాం

కోదండరాం

కెసిఆర్ కల్లు తాగిన కోతి, సింహంతో వేట ఆంధ్ర రాష్ట్రంతో ఆట వద్దు కెసిఆర్, సిఎం పదవి కావాలంటే కోరుకో, కెసిఆర్ కళ్లున్న దృతరాష్ట్రుడు అంటూ నిరసనలు.

ఆసనాలు

ఆసనాలు

సమైక్యాంధ్ర ఉద్యమంలో ఐకాస ఆధ్వర్యంలో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆసనాలు వేస్తూ నిరసన తెలుపుతున్న ఓ నిరసనకారుడు.

కుర్చీలు నెత్తి పైన

కుర్చీలు నెత్తి పైన

సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం కుర్చీలు నెత్తిన పెట్టుకొని తిరుపతిలో నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు.

శ్రీరాములు

శ్రీరాములు

శ్రీ పొట్టి శ్రీరాములుకు పూల దండ వేస్తూ సమైక్య నినాదాలు చేస్తున్న సమైక్యవాదులు. సీమాంధ్ర జిల్లాల్లో సమైక్య ఉద్యమం జోరుగా సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+