వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిల్మ్ సిటీకి కేసీఆర్ పేరు: కృష్ణ, విడిపోయినా..: హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో సినిమా పరిశ్రమకు పెద్ద పీట వేస్తామని, రెండువేల ఎకరాల్లో చిత్రపురిని నిర్మిస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన సూపర్ స్టార్ కృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు, ఏర్పాటు చేయబోయే చిత్రపురికి కేసీఆర్ ఫిల్మ్ సిటీ అని పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ఆయన గురువారం మాట్లాడారు. రెండువేల ఎకరాల్లో చిత్రపురిని నిర్మిస్తామని కేసీఆర్ చెప్పినందుకు ఆయనకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఫిల్మ్ సిటీకి కేసీఆర్ పేరే పెట్టాలన్నారు. హాలీవుడ్ లెవల్లో స్టూడియో నిర్మించడం మామూలు విషయం కాదన్నారు. ఈ ఫిల్మ్ సిటీ కడితే కేసీఆర్‌ను ఈ జనరేషన్ మాత్రమే కాకుండా రాబోయే జనరేషన్ కూడా గుర్తుంచుకుంటుందన్నారు.

KCR plans Film City: Krishna suggests CM's name

విడిపోయినా..: హరీష్ రావు

తెలుగు సినిమా రంగం సంఘాలుగా విడిపోయినా అభివృద్ధి కోసం కలిసే ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని ఇందిరానగర్లో 'తెలంగాణ స్టేట్ సినిమా డ్యాన్సర్స్ అండ్ డాన్స్ అసోసియేషన్' లోగోను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల నిర్మాణం కోసం సినిమా సిటీని ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పారు. సినీ రంగంలో తెలంగాణ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అవకాశం కలిగేలా చూస్తామని హరీష్ రావు చెప్పారు.

English summary
Super Star Krishna has praised Telangana CM K Chandrasekhar Rao for film city plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X